ఢిల్లీ : జన్‌లోక్‌పాల్ ముసాయిదా బిల్లుపై చర్చించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశంలో అవినీతి నేతల పేర్ల చిట్టా చదివి వినిపించారు. కేజ్రీవాల్ ఒక్కోపేరు చదువుతుంటే పార్టీ నేతలు దాన్ని ఆమోదిస్తూ కరతాళ ధ్వనులు చేశారు. కేజ్రీవాల్ చదివిన లిస్టులో రాజీవ్ గాంధీ, నరేంద్ర మోడీ, కపిల్ సిబల్, ఎ.రాజా, చిదంబరం, మాయావతి, యడ్యూరప్ప, సుశీల్ కుమార్ షిండే, వీరప్ప మొయిలీ, సురేశ్ కల్మాడీ, సల్మాన్ ఖుర్షీద్, కనిమొళి, అళగిరి, ములాయంసింగ్, ఫరూఖ్ అబ్దుల్లా, నవీన్ జిందాల్, నితిన్ గడ్కరీ, ప్రపుల్ పటేల్ తదితరుల పేర్లున్నాయి. రాహుల్, మోడీలు త బ్రాండ్ ఇమేజ్ పెంచుకోడానికి 500 కోట్ల చొప్పున ఖర్చు పెట్టారని, ఇప్పుడు వారు గెలిస్తే అదంతా ప్రజలనుంచి వసూలుచేస్తారని, ఇక వారినుంచి మంచి పాలన ఎలా ఆశిస్తామని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఒక్క అవినీతి నేత కూడా లోక్‌సభ లోనికి ప్రవేశించకుండా అడ్డుకోవాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.




