
బలవంతంగా సెలైన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 12 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఢిల్లీ లో దీక్ష పేరుతో హైడ్రామా సృ ష్టించిన టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు వ్రతం చెడింది. శుక్రవారం ఆయనను దీక్ష శిబి రం నుంచి పోలీసులు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. శనివారం వైద్యు లు ఆయనకు బలవంతంగా సెలైన్ ఎక్కించారు. బాబు బల హీనంగా ఉండటంతో చికిత్స ప్రారంభించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించామని రామ్ మనోహర్‌లోహియా ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన చికిత్సకు సహకరించకపోవడంతోనే ఇందుకు పూనుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఆయనకు మల్టీ విటమిన్లు అవసరమని వైద్యులు తెలిపారు. చంద్రబాబును ఆస్పత్రిలో జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్ పరామర్శించారు.
బాబు వ్రతం చెడింది




