
తెలంగాణ అంతటా సద్దుల బతుకమ్మ సంబరాలు
హైదరాబాద్, అక్టోబర్ 12 (జనంసాక్షి) :
సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణలో శనివారం వైభవంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్‌లో నిర్వహించిన ఉత్సవాలు కన్నుల పండువలా సాగాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు బతుకమ్మ ఆడి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. అంతకుముందు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. తంగేడు, గునుగు, అల్లి, కట్ల, గోరంట, రుద్రాక్ష, బంతి, సీతమ్మజడ తదితర పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. అంతాఒక చోట చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. బతుకమ్మలను నిమజ్జనం చేసిన తర్వాత సత్తుపిండి వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. హన్మకొండలోనూ సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పద్మాక్షమ్మ గుట్ట వద్దకు వేలాదిగా తరలివచ్చిన మహిళల బతుకమ్మ ఆటపాటలతో ఆ ప్రాంతం మార్మోగింది.
ట్యాంక్‌బండ్‌పై ఘనంగా బతుకమ్మ




