Tuesday, 3 November 2026

రామ్‌లీలా మైదానంలో ఘనంగా దసరా


పాల్గొన్న ప్రధాని, సోనియా
చెడుపై మంచి విజయం : మన్మోహన్‌
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) :
దేశ రాజధాని ఢిల్లీ లో ఆదివారం దస రా వేడుకలు ఘనం గా జరిగాయి. రామ్‌ లీలా మైదానంలో జ రిగిన రావన దహన కార్యక్రమానికి ప్రధా ని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ అధ్యక్షు రాలు సోనియా గాంధీ, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని అభివర్ణించారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్నారు. దేశ ప్రజలందరి జీవితాల్లో దసరా కొత్త వెలుగుల్ని నింపాలని ఆకాంక్షించారు. అనంతరం రావణుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక వాద్రా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *