
93 మంది మృతి93 మంది మృతి
సెబు, అక్టోబర్ 15 (జనంసాక్షి) :
సెంట్రల్ ఫిల్పిప్పీన్ దీవి బొహోల్, సెబు ప్రావిన్స్‌లో మంగళవారం ఉదయం సంభవించిన భారీ భూకంపంలో 93 మంది మృత్యువా తపడ్డారు. దీని తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 7.2గా నమోదయింది. భూ కంపం ధాటికి ఓ భవనం కుప్పకూలిపోయింది. కూలిన భవన శిథి లాల కింద పెద్ద సంఖ్యలో రోగులు చిక్కుకుపోయారు. వారిని రక్షిం చడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు. శతాబ్దాల క్రితం నాటి రాతితో నిర్మించిన ప్రార్థనా మందిరాలు పేకమేడల్లా కుప్పకూ లాయి. రోడ్డు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీనికి తోడు గాలివాన అధికంగా ఉండటంతో విమా నాలు, హెలిక్యాప్టర్ల ద్వారా కూడా సహాయక చర్యలు చేపట్టడానికి అంతరాయం కలుగుతోంది. శిథిలాల కింద చిక్కిన బాధితులు ఆదుకునే వారి కోసం ఆర్థనా దాలు చేస్తున్నారు. ప్రకృతి సహకరించక సహా యక చర్యలు ఆలస్యం కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికా రులు పేర్కొన్నారు. భూకంపం భయంతో పలు వురు పరుగులు తీయడంతో తొక్కిసలాటలు సంభవించాయి. మనీలా సమయం ప్రకారం ఉదయం 8.12 గంటలకు భూకంపం సంభి వించింది. వెంటనేజనం రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూకంపం కేంద్రం కార్మెన్‌టౌన్‌కు 33 కిలోమీటర్లు దూరంలో వుంది. భవనాలు పడిపో యాయి. రోడ్లు బీటలు వారాయి, వంతెనాలు కూడ కుప్పకూలాయి. జనాభా ఎక్కువగా ఉండే సె బు నగరంలో నష్టం కూడ ఎక్కువగానేవుంది. చేపలమార్కెట్ పైకప్పు కూలిపోవడంతో పలువు రు మరణించారు. ప్రభుత్వం అందించే నగదు సాయం కోసం చాలామంది సెబులో ఓ జిమ్ వద్ద వేచి ఉండగా భూకంపం రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. గా ఎనిమిది మంది గా యపడ్డారు. మరో నగరం కూడ తొక్కిసలాట జరిగి, 18 మంది గాయపడ్డారు. బోహోల్ నగరంలో 16 మంది, సెబు నగరంలో 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంత తీవ్రత ఉన్నభూకంపం వచ్చినా దానికేంద్రం భూమి లోనే ఉండటంతో సునామీ రాలేదు. బక్రీద్ సందర్భంగా పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించటంతో చాలా నష్టం తప్పింది.
ఫిలిప్పీన్‌లో భారీ భూకంపం




