
న్యూఢిల్లీ, అక్టోబర్ 15 (జనంసాక్షి) :
దేశ పాలన సాగించే కేంద్ర మంత్రులే గడు వు దాటినా తమ ఆస్తు ల వివరాలు వెల్లడించ లేదు. ఎవరో ఇద్దరు మాత్రులు కాదు ఏకం గా 35 మంది మం త్రులు ఇప్పటి వరకు తమ సంపాదన లెక్క ల చిట్టా ప్రధానికి అందజేయలేదు. ఈ ఏడాది ఆగస్టు 31నాటి కల్లా కేంద్ర మంత్రులంతా తమ ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. 77 మంది కేంద్రమంత్రుల్లో 42 మంత్రులు మాత్రమే ఇప్పటి వరకు ఆమ ఆస్తుల వివరాలు వెల్లడించారు. 32 మంది కేబినెట్ మంత్రుల్లో 18 మంది, స్వతంత్ర హోదా కలిగిన గల 12 మందిలో ఏడుగురు, 33 మంది సహాయ మంత్రుల్లో 17 మంది మాత్రమే తమ ఆస్తుల చిట్టాపద్దులు బయటపెట్టారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్, పౌరవిమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్, న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్, బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్, మానవ వనరుల శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు, జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావత్ ఆస్తి అప్పులు ప్రకటించాల్సిన వారి జాబితాలో ఉన్నారు. సహాయ మంత్రుల్లో శశిథరూర్ (హెచ్‌ఆర్‌డీ), ఆర్పీఎన్ సింగ్ (హోం), పురేందశ్వరి (వాణిజ్యం), ప్రదీప్ జైన్(గ్రామీణాభివృద్ధి), అధిర్ రాజన్ చౌధురి (రైల్వే) ఉన్నారు. ఇక ఆస్తులు వివరాలు వెల్లడించిన వారిలో ఏకే ఆంటోని, శరద్‌పవార్, సుశీల్‌కుమార్‌షిండే, పి. చిదంబరం, వీరప్పమొయిలీ, మల్లికార్జున ఖార్గే, ఆస్కార్ ఫెర్నాండేజ్, సల్మాన్ ఖుర్షీద్ ఉన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మంత్రులందరూ తమ సభ్యులకున్న ఆస్తులు, అప్పుల వివరాలను ప్రధానమంత్రికి సమర్పించాల్సి ఉంటుంది. ఏటా ఆగస్టు 31 దీనికి తుది గడువుకాగా సగం మంది మంత్రులు పట్టించుకోకపోవడం గమనార్హం.
ఆస్తులు వెల్లండించని 35 మంది కేంద్ర మంత్రులు




