
జైత్రయాత్ర సభలో డెప్యూటీ సీఎం
బోధన్/నిజామాబాద్, అక్టోబర్ 18 (జనంసాక్షి) :
హైదరాబాద్ ఇదివరకు ఓ దేశంగా ఉండే అది ఇప్పుడు తామే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పేవారికి తెలుసో లేదో అంటూ డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జైత్రయాత్ర విజయవంతం అయింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక నేతలు, మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, హైదరాబాద్ దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వమే అన్నింటా అభివృద్ధి చెందిన నగరమని చెప్పారు. దీనిపై సీమాంధ్ర ప్రాంత వలస పాలకులు చేస్తున్నవన్నీ అబద్ధపు ప్రకటనలేనని అన్నారు. సోనియాకు సమాధి కట్టడాన్ని ఖండిస్తున్నామని మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోనియావల్లే తెలంగాణ కల సాకారమైందని, ఆమె చెప్పిన వ్యక్తే తెలంగాణకు సీఎం అవుతారని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును ఎవరూ ఆపలేరన్నారు. విడిపోతే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి డికె అరుణ మాట్లాడుతూ, అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పండిదని తెలిపారు. అన్ని పార్టీల అభిప్రాయం తర్వాతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అనుమానాలను వీడాలని సీమాంధ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా.. తెలంగాణను అడ్డుకునే యత్నాలు చేయొద్దు.. బతికి ఉన్నవాళ్లకు సంస్కారం చేయడం మన సంప్రదాయంకాదని తెలిపారు. డిసెంబరులోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు యుపిఎ చైర్‌పర్సన్ సోనియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎంపి మధుయాష్కి అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. వైఎస్‌ఆర్‌సిపి, టీడీపీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సోనియాను విమర్శించే స్థాయి జగన్‌కు లేదన్నారు. సీమాంధ్ర ప్రాంత నాయకులు అక్కడి ప్రజలను మోసపుచ్చుతున్నారని అన్నారు. సీమాంధ్ర ప్రజలను తమ గుండెకు హత్తుకుంటామని, ఎటువంటి భయాందోళనలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఓ దేశంగా ఉండే




