Tuesday, 3 November 2026

అన్ని పార్టీలు లేఖలిచ్చాకే విభజన


సీమాంధుల హక్కులను కాపాడుతాం : బొత్స
విశాఖపట్నం, అక్టోబర్‌ 19 (జనంసాక్షి)
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకూ ప్రయత్నం చేస్తాని, విభ జన తప్పనిసరైతే సీమాంధ్ర ప్రజల హక్కులు కాపాడతామని పీసీసీ అధ్య క్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌ బలహీనపడిందని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజా వ్యతిరేకత తప్పదన్నారు. శనివారం బొత్స విశాఖలో మీడియాతో మాటా ్లడారు. అంతకు ముందు ఆయన తమిళ నాడు గవర్నర్‌ కె.రోశయ్యతో సమావే శమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణా మాలు, ఉద్యమ ప్రభావం, విభజన వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రం లో 75 శాతం మంది ప్రజలు కోరుకుం టున్నందునే కేంద్రం రాష్ట్ర విభజనకుసిద్ధపడిందన్నారు.                                                                                                                                                                                                                                                              వాస్తవాలు మాట్లాడే తాను చిక్కుల్లో పడుతున్నానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ మినహా మిగతా పార్టీలన్నీ రాజకీయ లబ్ధి కోసం నాటకాలాడుతోన్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ సొంత ప్రయోజనాల కోసం ఏనాడూ పాకులాడదని చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ను దోషిగా చూపడంపై బొత్స మండిపడ్డారు. అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పాకే విభజన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కానీ, ఇప్పుడు పలు రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం మాటలు మారుస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ తెలుగుదేశం లేఖ ఇచ్చిందని, ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్టాన్న్రి విభజించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లేఖ రాసిందని గుర్తు చేశారు. సమన్యాయం పేరుతో గుంటూరులో విజయలక్ష్మి, జైలులో జగన్‌ దీక్ష చేశారని, అధికారం కోసమే ఇవాళ సమైక్యవాదం వినిపిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏ విషయంపైనా స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. ముందు రాష్ట్ర విభజనకు అంగీకరించి ఇప్పుడు మాట మార్చడమేమిటని ప్రశ్నించారు. పార్టీలు మారుతున్న నేతలకు పదువులపైనే తప్ప సమైక్యవాదం ముఖ్యం కాదని విమర్శించారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుందని, విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీని మాత్రమే దోషిగా చూడం తగదన్నారు. రాజ్యాంగబద్దంగానే విభజన ప్రక్రియ జరుగుతుందని, అయితే అది త్వరలో పూర్తవుతుందని తాను భావించడం లేదన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను గమనంలోకి తీసుకొనే అధిష్టానం వ్యవహరిస్తోందన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్‌ మినహా మిగతా పార్టీలన్నీ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. అధికారంలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నందువల్లే విభజన నిర్ణయంపై ఇంత చర్చ సాగుతోందని, ఇతర పార్టీ అధికారంలో ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదన్నారు. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినేనని చెప్పుకొచ్చారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాధ్యతాయుతమైన కార్యకర్తగా ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ప్రస్తుతం తనది కుటుంబ పెద్ద పాత్ర అని అన్నారు. టీఆర్‌ఎస్‌ విలీనంపై విలేకరులు ప్రశ్నించగా.. దానిపై తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని బదులిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *