Tuesday, 3 November 2026

తెలంగాణను వెనకబడేయడంతో అసంఘటిత రంగానికి తీరని నష్టం

– టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి) :
సీమాంధ్ర వలస పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని వెనుక బడేయడంతో ఇక్కడ వ్యవసాయ, అసంఘటిత రంగా లు బాగా వెనుకబడిపోయాయని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా అసంఘ టిత కార్మికులకు సైతం తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని సుందరయ్య కళానిల యంలో తెలంగాణ కార్మిక సంఘాల సమాఖ్య (టీఎఫ్‌టీ యూ) ఆవిర్భావ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్‌ మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో చేపట్టిన సరళీకరణ విధానాల వల్ల కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. చంద్రబాబు పెట్టుబడిదారీ వ్యవ స్థనే పెంచిపోషించారని అన్నారు. ప్రభుత్వపరంగా అసం ఘటిత కార్మికులకు న్యాయం చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ అందరిదీ అనే నినాదంతో ముందకు వెళ్దామని చెప్పారు. విభజన విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానానికి సీమాంధ్ర పెద్దలు తెలంగాణపై అవాస్తవాలు చెబుతున్నారని, ఇష్టం వచ్చిన ట్లుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఎందరు అడ్డుప డినా రాష్ట్ర విభజన ఆగదన్నారు. టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటుతో తమ బాధ్యత ముగిసిపోదని, 13 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ ప్రజలపై కొనసాగిన వివక్షను తొలగించేందుకు పోరాడుతామని తెలిపారు. ఎంపీ వివేక్‌ మాట్లాడుతూ కార్మికుల హక్కులు, తెలంగాణ ప్రాంత సమస్యలపై ఉద్య మానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. కార్యక్రమంలో మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *