
– వ్యూహాత్మక వ్యాపార వాణిజ్య సంబంధాలు, పలు కీలకాంశాలపై ఒప్పందాలు
న్యూఢిల్లీ/మాస్కో, అక్టోబర్ 20 (జనంసాక్షి):
రష్యా, చైనా దేశాల్లో ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆదివారం రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్నారు. ఆయన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. ఆయనకు మాస్కో విమానాశ్రయంలో రష్యా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా రష్యా ప్రతినిధులు, అధికారుల బృందంతో చర్చలు జరిపారు. వ్యూహాత్మక వ్యాపార, వాణిజ్య సంబంధాలపై పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. అణు జలాంత ర్గామిని అద్దెకు తెప్పించే విషయమై రష్యాతో కీలక చర్చలు జరిపారు. రష్యా పర్యటన అనంతరం ప్రధాని చైనాకు బయల్దేరి వెళ్తారు. చైనాతో సరిహద్దు సమస్యపై ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానితో చర్చించనున్నారు. చైనాతో సరిహద్దు సహకార ఒప్పందం తన పర్యటనలో ప్రధాన అజెండా అని అంతకుముందు ప్రధాని ఓ ప్రకటనలో వెల్లడించారు. కీల క సమస్యల పరిష్కారానికి చైనాతో చర్చించనున్నట్లు పేర్కొ న్నారు. భారత్ చైనా మధ్య ఎప్పటి నుంచో సమస్యలు న్నాయని తెలిపారు. ఇరు దేశాలు స్నేహపూర్వక వాతావ రణంలో నిబద్ధతతో చర్చిస్తాయని పేర్కొన్నారు. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, మన్మోహన్‌సింగ్ గౌరవార్థం విందు ఇవ్వనున్నారు.
మాస్కో చేరుకున్న ప్రధాని




