Tuesday, 3 November 2026

తెలంగాణ పునర్నిర్మాణంలో సీపీఐ కీలకపాత్ర వహిస్తుంది


నారాయణ
హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి):
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో సీపీఐ కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లిలో సీపీఐ మాజీ ఎమ్మెల్యే, దివంగత విఠల్‌రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. గతంలో తెలంగా ణకు అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలు స్వార్థంతో ఇప్పుడు అడ్డం తిరిగాయని తెలిపా రు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం సలహా లు, సూచనలతో ప్రత్యేక నివేదిక తయారు చేసి కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కు మార్‌షిండేకు అందజేస్తామని తెలిపారు. ఈ నివేదికను ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచి తెప్పించిన సంపూర్ణ సమాచారంతో సిద్ధం చేశామని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంతోనే ప్రయోజనం ఉండబోదని, ఇంతకాలం అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అం దుకోని వర్గాలకు సైతం న్యాయం చేసినప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సార్థకత చేకూరుతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చారిత్రక అవసరమని, ఈ సందర్భంలో అడ్డం తిరిగిన పార్టీలకు ఇక్కడ రాజకీయంగా పుట్టగతులుండవని అన్నారు. తెలంగాణపై సీపీఐ మొదట చెప్పిన మాటకే కట్టుబడి ఉందని, కానీ మిగతా పార్టీలు రాజకీయంగా సీమాంధ్ర ప్రాంతంలో పట్టు నిలుపుకునేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. సోదర సీపీఎం వైఖరినీ ఈ సందర్భంగా నారాయణ తప్పుబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *