హైదరాబాద్ యూటీ అసాధ్యం
తీర్మానంపై ఇప్పుడే ఏం చెప్పలేం
కుండబద్దలు కొట్టిన దిగ్విజయ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 22 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కొట్టిపడేసింది. యూటీ అంశంపై చర్చలు జరుపుతోందన్న వార్తలను తోసిపుచ్చింది. హైదరాబాద్‌ను కేం ద్రపాలిత ప్రాంతం చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఈ అంశంపై తా ను ఎవరితో మాట్లాడలేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్టాన్న్రి రాజ్యాంగపరంగానే ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విూడియాతో మాట్లా డారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభి స్తుందని విజయవాడలో కేంద్ర మంత్రి జేడీ శీలం పేర్కొన్న నేపథ్యంలో.. దిగ్విజయ్ స్పందించారు. తన వ్యాఖ్యలను శీలం తప్పుగా అర్థం చేసుకొని ఉంటారన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయడం కుదరదన్నారు. సీడ బ్ల్యూసీ నిర్ణయం మేరకే విభజన జరుగుతుందని స్పష్టం చేశారు. సీడబ్ల్యూ సీ అందరికీ శిరోధార్యమని తెలిపారు. హైదరాబాద్ అంశం సున్నితమైన దని, సీడబ్ల్యూసీ తీర్మానం మేరకే విభజన జరుగుతుందని చెప్పారు. రాజ్యంగ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రుల బృం దం నిర్నయం తీసుకుంటుందన్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని, మిగతా సమస్యలు ఏమైనా ఉంటే మంత్రుల బృందం చూసుకుంటుందని చెప్పారు. అసెంబ్లీ కి వచ్చే బిల్లు రూపకల్పనపై కేంద్ర ¬ం శాఖ చూసుకుంటుందన్నారు. రాజ్యాంగ ప్రక్రియ ప్రకారమే తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని దిగ్విజ య్ తెలిపారు. అసెంబ్లీకి తీర్మానం వస్తుందా? బిల్లు వస్తుందా? అని ప్రశ్నించగా.. దానిపై తాను ఇప్పుడే ఏవిూ చెప్పలేనన్నారు. తీర్మానంపై కేంద్ర ¬ం మంత్రితో చర్చించానని వెల్లడించారు. విభజనపై షెడ్యూల్‌ను త్వరలోనే అందజేస్తానని ఆయన చెప్పారన్నారు. అయితే, జీఓఎం పంపిన కొత్త షెడ్యూల్ మేరకు తీర్మానం ఉంటుందని తెలిపారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం ఉండదని ఇటీవల కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. కేవలం ముసాయిదా బిల్లు మాత్రమే అసెంబ్లీకి వెళ్తుందని చెప్పారు. అయితే, తాజాగా తీర్మానం ఉంటుందని దిగ్విజయ్ చెప్పడం విశేషం. విభజన తుపానును ఆపుతామన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు దిగ్విజయ్ నిరాకరించారు. సీఎం కిరణ్ అధిష్టానానికి విశ్వాసపాత్రుడు అని చెప్పారు. హైకమాండ్ తీసుకొనే నిర్ణయాలకు కట్టుబడి ఉంటారని చెప్పారు. ఆయన పార్టీని వీడే ప్రసక్తే లేదని మరో ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మళ్లీ రాజీనామాలు చేసిన అంశాన్ని ప్రస్తావించగా.. ఎంపీల రాజీనామాలు సరికాదని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఎంపీలు వాస్తవాలను అర్థం చేసుకోవాలని సూచించారు. అధిష్టానం నిర్ణయానికి నేతలంతా కట్టుబడి ఉండాలని సూచించారు. రాజీనామాలను ఉపసంహరించుకోవాలని గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.