Tuesday, 3 November 2026

ఆర్టీసీకి సమైక్య దెబ్బ


చార్జీలు బాదే దిశగా యాజమాన్యం
హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) :
ఆర్టీసీకి సమైక్య ఉద్యమం దెబ్బ తగిలింది. రెండు నెలల పాటు జరిగిన సమ్మె నష్టాన్ని పూడ్చుకు నేందుకు, ప్రయాణికులపై భారం మోపేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తోంది. రెండు నెలల సమైక్యాం ధ్ర సమ్మె కారణంగా 745 కోట్ల నష్టం వాటిల్లిందని ఇప్పటికు ఎం డి ఎకె ఖాన్‌ చెప్పారు. దీనిని పూ డ్చుకునేందుకు రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ బస్సు ఛార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ ఉన్నతాధికారులు ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఛార్జీలు ఎంత మేర పెంచాలన్న విషయంపై వారు కసరత్తు చేస్తున్నారు. అన్ని బస్సు సర్వీసులపై కనిష్ఠంగా కిలో విూటరుకు 10 పైసలు చొప్పున ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో ప్రభుత్వం ముందుకు ఛార్జీల పెంపు ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. అయితే సీమాంధ్ర సమ్మెతో కూడిన నస్టాన్ని మోపితే ఊరుకోబోమని తెలంగాణ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుంటే  జంట నగరాల పరిధిలో ఉన్న ఆర్టీసీ డిపోలను జీహెచ్‌ఎంసీలో కలిపితే ఊరుకోమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు హెచ్చరించారు. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ) రెండవ వార్షికోత్సవ వాల్‌పోస్టర్‌ను ఆయన తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన సంస్థ టీఎంయూ అని కొనియాడారు. ప్రారంభించిన 13 నెలల్లోనే టీఎంయూ గుర్తింపు పొందిందని తెలిపారు. జంట నగరాల పరిధిలో ఉన్న ఆర్టీసీ డిపోలను జీహెచ్‌ఎంసీలో కలపాలని కుట్ర పన్నుతున్నారని చెప్పారు. దీన్ని టీఆర్‌ఎస్‌ తీవ్రంగా ఖండిస్తున్నదని స్పష్టం చేశారు. ఏ కార్మిక సంఘం కూడా ఆర్టీసీని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడాన్ని ఒప్పుకోదని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *