
అమెరికాకు షిండే చురక
ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టండి
కాశ్మీర్ సరిహద్దులో సైనికులతో
కేంద్ర హోం మంత్రి గెట్ టు గెదర్
జమ్మూ, అక్టోబర్ 22 (జనంసాక్షి) : కాశ్మీర్ సమస్య పరిష్కారంలో మూడో వ్యక్తి జోక్యం అక్కర్లేదని అమెరికాకు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చురక అంటించారు. జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంత ర్భాగమని షిండే స్పష్టం చేశారు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ వరు సగా కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్ర ¬ం మంత్రి షిండే మంగళవారం సరిహద్దులోని పలు సెక్టార్లలో పర్యటించారు. ఉదయం సాంబ సెక్టార్‌కు చేరుకున్న షిండే బీఎస్‌ఎఫ్ జవాన్లతో సమావేశమయ్యారు. అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైన్యం, ఉన్నతాధికారులతో సవిూక్షించారు. నియంత్రణ రేఖ వెంబడి ముష్కరుల దాడిలో దెబ్బ తిన్న ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మూడో వ్యక్తి (అమెరికా) జోక్యం చేసుకోవాలన్న పాక్ ప్రతిపాదనను షిండే తోసిపుచ్చారు. పాక్ సూచన తమకు ఆమోదయోగం కాదని స్పష్టం చేశారు. ‘కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని నెహ్రూ కాలం నుంచి స్పష్టం చేస్తున్నాం’ అని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్-పాక్‌లు పరిష్కరించుకోవచ్చన్నారు. భారత సైనికులు జాతికి నిజమైన హీరోలు అని షిండే ప్రశంసించారు. దేశ సార్వభౌమత్వం కోసం, సమైక్యత కోసం సైనికులు చేస్తున్న కృషి, త్యాగం అభినందనీయమని, దేశం కోసం వారెంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నారని కొనియాడారు. ‘వారి (పాక్ బలగాలు) దాడులను తిప్పికొట్టడంలో విూరు చూపిస్తున్న తెగువ ప్రశంసనీయం. దాడిని తిప్పికొట్టి వారికి తగిన బుద్ది చెప్పండి. యావత్ దేశం విూవెంట ఉంది’ అని అన్నారు. పారామిలిటరీ బలగాల డిమాండ్లను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని, ఆయా ప్రతిపాదనలను కేంద్రక్యాబినెట్ ముందుంచుతానని హావిూ ఇచ్చారు.
కాశ్మీర్ పరిష్కారంలో మీ జోక్యం అక్కర్లేదు




