Tuesday, 3 November 2026

ఔను.. నేను విభజన వాదినే


తెలంగాణ ప్రక్రియ జరిగి తీరుతుంది
కేంద్రమంత్రి జేడీ శీలం
విజయవాడ, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) :
తను ముమ్మాటికీ విభజన వాదినేనని కేంద్ర మంత్రి జేడీ శీలం కుండబద్దలు కొట్టారు. మంగళవారం స్థానిక ఓ ప్రైవేట్‌ హోట్‌ల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ ¬టల్‌ యజమానికి సమైక్యాంధ్ర ఉద్యమ నేత కె. శివాజి ఫోన్‌ చేసి మరీ మంత్రి ప్రెస్‌విూట్‌కు అవకాశంకల్పించొద్దని హెచ్చరించారు. అదే జరిగితే మాత్రం ¬టల్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించడంతో యజమాని కాస్తా మంత్రిని కాళ్లా వేళ్లా పట్టుకుని ప్రెస్‌విూట్‌ బయట పెట్టుకోవాలని బ్రతిమాలాడు. దీంతో ఆయన ఆరుబయట విూడియాతో మాట్లాడుతూ తాను చెప్పదలుచుకున్నది చెప్పుతానని విూడియా చెప్పుమన్నట్లు చెప్పడం చేతగాదన్నారు. రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచాలంటున్నారా లేదా అన్న ప్రశ్నను విూడియా పదేపదే గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో విసుక్కున్నారు. విూరు అనుకున్నట్లుగా చెప్పాలంటే తానేం చేయలేనన్నారు. తనకు భావ స్వేచ్చ ఉందని, అందునా ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని కూడా రక్షించు కోవాల్సినఅవసరం కూడా ఉందన్నారు. తమది ప్రాంతీయ పార్టీనో, ఉపప్రాంతీయ పార్టీనో కానే కాదన్నారు. అడ్డదిడ్డంగా లేఖలివ్వచడమేకాక, ఎప్పుడు విభజిస్తారు ఇంకెంతకాలం అంటూ రెచ్చగొట్టిన పార్టీలు కాంగ్రెస్‌ పార్టీమెడపై కత్తిపెట్టిన సంఘటనలు కూడా విూడియా ప్రతినిధులు గుర్తుచేసుకోవాలని ఎదురు ప్రశ్నించారు  నేడు అవేపార్టీలు యూటర్న్‌ తీసుకుని కాంగ్రెస్‌ను బొందపెట్టేందుకు దోషిగా చూపిస్తున్నాయని ఆరోపించారు. ఎవరేం చేసినా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ జరిగి తీరుతుందన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఓట్లు, సీట్లకోసం రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. విభజనను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 80శాతంమంది అంగీకరిస్తూనే ఉన్నారన్నారు. అయితే హైదరాబాద్‌పైన హక్కులతోపాటు, సాగు నీరు, త్రాగు నీటిపై సీమాంధ్ర  ప్రజలకున్న అనుమానాలను నివృత్తిచేయాల్సిన అవసరం కాంగ్రెస్‌పై ఉందన్నారు. దీనికోసమే తాను ప్రయత్నిస్తున్నానని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందకు ఏవిధంగా చేయాలో ఆవిదంగా చేస్తూనే ఉన్నానన్నారు. విభజన తర్వాత హైదరాబాద్‌లో కూడా సీమాంధ్రులకు హక్కు కావాలంటే కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ప్రధానంగా పట్టుబడుతున్నానన్నారు. అది జరిగితే సీమాంధ్రకు చెందిన నిరుద్యోగులెందరికో మేలు జరుగుతుందన్నారు. ఇది గనుక పరిష్కరించు కోగలిగితే సీమాంధ్రకు పెద్దగానష్టం ఉండనే ఉండదన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలో ఒక్కటి కాదు రెండు కాదు సవాలక్ష పరిష్కారాలు చూపించిందన్నారు. దీనిపై నమ్మకం లేకనే కేంద్రం తన పంతాలో తాను పయనిస్తూ ముందుకు వెళ్లుందన్నారు. కేంద్రం కూడా సీమాంధ్రకు అన్యాయం చేయాలనే తపనతో లేదన్నారు. సమస్యలను పరిష్కరిం చేందుకు చిత్తశుద్దితోనే వ్యవహరిస్తుందన్నారు. సీమాంధ్రకు కావాల్సిన వాటిపై కేంద్రానికి లిఖిత పూర్వకంగా ఇస్తే పరిష్కరిస్తుందన్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందో లేదో తాను చెప్పలేనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *