Tuesday, 3 November 2026

చైనాకు చేరిన ప్రధాని


సరిహద్దు సమస్యతో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం
బీజింగ్‌ విమానాశ్రయంలో మన్మోహన్‌కు ఘన స్వాగతం
బీజింగ్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) :
భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంగళవారం చైనా చేరుకున్నారు. బీజింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. మూడు రోజుల పర్యటనలో మన్మోహన్‌సింగ్‌ పలు కీలకాంశాలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు జరిపే అవకాశం ఉంది. భారత్‌-చైనా మధ్య దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు సమస్యపై ఇరు వురు నేతలు కీలక చర్చలు జరిపి ఒప్పందం దిశగా అడుగులు వేసే అవ కాశం ఉంది. వారం రోజుల విదేశీ (రష్యా, చైనా) పర్యటన కోసం ఢిల్లీ నుంచి మాస్కో వెళ్లిన మన్మోహన్‌, మంగళవారం మాస్కో నుంచి బీజిం గ్‌కు చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య ప్రజల పరస్పర రవాణాకు వీసా నిబంధనల సడలింపు, వ్యాపార వాణిజ్య సంబంధాలపై కీలక చర్చలు జరుపనున్నారు. 1975 నుంచి సాగుతూ వస్తున్న సరిహద్దు వివాదంపై కూడా చర్చించనున్నారు. అయితే ఇరు దేశాల అధికారుల మాత్రం సరిహద్దు వివాదాన్ని మీడియానే పెద్దదిగా చేసి చూపిస్తుందని అంటున్నారు. 1993 నాటి శాంతి ఒప్పందానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని, బుధవారం నాటి చర్చల్లో తాజాగా సరిహద్దు వివాదం పరిష్కారానికి నూతన ఒప్పందం చేసుకోనున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *