Tuesday, 3 November 2026

ఇకనుంచైనా మారేనా..!


భారత్‌, చైనా
కీలక ఒప్పందాలు
సరిహద్దు, నదీ జలాలు, ఉపరితల రవాణా, ద్వైపాక్షిక సంబంధాలతో సహా పది ఒప్పందాలపై సంతకాలు
బీజింగ్‌, అక్టోబర్‌ 23 (జనంసాక్షి) :
సరిహద్దులో శాంతి పరిరక్షణకు భారత్‌, చైనా అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు బుధవారం రెండు దేశాల మధ్యం ఒప్పందం కుదిరింది. సరిహద్దులో శాంతి పరిరక్షణతో పాటు నదీజలాలు సహా తొమ్మిది ఒప్పందాలపై ఇరు దేశాల ప్రధానులు సంతకం చేశారు. చైనా పర్యటనలో భాగంగా బుధవారం మన్మోహన్‌ చైనా ప్రధాని లీ కెషాంగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై ఉభయులు సంతకాలు చేశారు. అనంతరం మన్మోహన్‌ మాట్లాడుతూ.. చైనాతో సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం (బీడీసీఏ)పై సంతకం చేసినట్లు చెప్పారు. దాంతో ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి, సుస్థితరతలు నెలకొంటాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా ప్రధానితో భేటీలో జరిగిన చర్చలు సంతృప్తికరంగా సాగాయని వివరించారు. అలాగే తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు చైనాతో కలిసి పని చేస్తామన్నారు. భారత్‌-చైనా చేతులు కలిపితే ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూ స్తుందన్నారు. పరస్పర సహకారంతో పాటు స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగించాలని నిర్నయించినట్లు చెప్పారు. ఇరు దేశాలు మన్మోహన్‌పై చైనా ప్రధాని లీ కెషాంగ్‌ ప్రశంసలు కురిపించారు. ఆయన పాలనలో భారత్‌-చైనా సంబంధాలు త్వరితగతిన మరింత మెరుగుపడడమే కాకుండా కొత్త పుంతలు తొక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మన్మోహన్‌తో జరిగిన భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంతర్జాతీయ అంశాలపై లోతుగా చర్చించినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *