Tuesday, 3 November 2026

వదినపై అత్యాచారయత్నానికి యత్నించిన మరిది ,ప్రతిఘటించడంతో దారుణ హత్య చేసిన ప్రబుద్దుడు

పెద్దశంకరంపేట : ఓ కామాంధుడు వదినపై అత్యాచారాయత్నానికి పాల్పడడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి నిందితుడు పరారయ్యాడు. ఈ సంఘటన పెద్దశంకరంపేటలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జోగిపేట ,సీఐ సైదానాయక్‌ , ఎస్‌ సత్యనారాయణ కథనం మేరకు ….నారాయణఖేడ్‌ మండలం రుద్రారం గ్రామానికి చెందిన కాశమోళ్ల సుజాత ( 27) , రమేష్‌ దంపతులు బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం పెద్దశంకరం పేటకు వలస వచ్చారు. స్థానిక పెట్రోల్‌ బంక్‌ సమీపాన గుడిసె వేసుకుని రోకళ్లు తయారు చేస్తూ తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారం క్రితం జీవనోపాధి కోసం రమేష్‌ పెద్ద నాన్న కుమారుడైన చందర్‌ వీరికి జతకట్టారు. వీరితో కలిసి రోకళ్ల తయారీలో పాలుపంచుకునే వాడు. ఇదిలా ఉండగా రమేష్‌కు జ్వరం రావడంతో మంగళవారం ఉదయం చికిత్స నిమిత్తం నారాయణఖేడ్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి స్వగ్రామమైన రుద్రారానికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన చందర్‌ ఆ రోజు మద్యం సేవించి అర్ధరాత్రి వదిన వరుసైన సుజాత నోటికి లుంగీ, టీషర్టు చుట్టీ అత్యాచారయత్నానికి ఒడిగట్డాడు, అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. కాగా భర్త రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వానికి తరలించారు. కాగా మృతురాలికి ఏడాది వయసు ఉన్న కుమారుడున్నారు. మృతదేహం బంధువుల రోదనలు అక్కడున్న వారిని కలిచివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *