జగన్‌ సభ పేరుతో తెలంగాణ బిడ్డలపై జులుం


సమైక్య సభలో మార్మోగిన జై తెలంగాణ
నిజాం కళాశాల ఎదుట ఉద్రిక్తత
జగన్‌ శవయాత్ర
ఎన్‌సీసీ గేటు వద్ద టెన్షన్‌
నీకు దమ్ముంటే ఉస్మానియాకు రా..
ఓయూ విద్యార్థుల సవాల్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 26 (జనంసాక్షి) :
సమైక్య శంఖారావం సభ ను అడ్డుకుంటారనే కార ణంతో పోలీసులు తెలం గాణ బిడ్డలపై జులుం ప్రదర్శించారు. ఎల్బీనగ ర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, నల్లకుంట తదితర ప్రాంతాల్లో వందలాది మంది తెలంగాణవాదులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నిజాంకళాశాల హాస్టల్‌ను పోలీసులు శనివారం మూసివేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎల్బీ స్టేడియంలో వైఎస్సార్‌ సీపీ నిర్వహించే సమైక్య శంఖారావం సభకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేపడతారన్న అనుమానంతో పోలీసులు హాస్టల్‌ గేటుకు తాళం వేశారు. పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావం సభకు నిరసనగా విద్యార్థులు జగన్‌ శవ యాత్రను నిర్వహించి దిష్టి బొమ్మను దహనం చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు ముళ్ల కంచెలను, బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై మండిపడిన విద్యార్థులు హాస్టల్‌ గేట్లను పగులగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు పడి ప్రజలు , రైతులు ఇబ్బంది పడుతుంటే జగన్‌కు రాజకీయాలు కావాల్సి వచ్చాయా అంటూ మండిపడ్డారు. లక్ష కోట్లకు అవినీతికి పాల్పడ్డ ప్రజా సొమ్ముతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ సభకు జనాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమని, హైదరాబాద్‌లో సభను నిర్వహించే నైతిక హక్కు సమైక్య రాష్ట్రం కోరుకునే వారికి లేదని వారు మండిపడ్డారు. తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వారు జగన్‌ను హెచ్చరించారు. నిజాం కళాశాల ఒక నిప్పుల కొలిమిలాంటిదని, దాని పక్కన సభ పెట్టుకునే ధైర్యం జగన్‌కు ఎక్కడిదని వారు అన్నారు. జగన్‌కు దమ్ము ధైర్యం ఉంటే నిజాం కళాశాలకు, ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని వారు సవాల్‌ చేశారు. ఇదే తరహాలో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమైక్య శంఖారావం సభను అడ్డుకునేందుకు ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అయితే పోలీసులు వారిని ఎన్‌సీసీ గేట్‌ ఎదుటే అడ్డుకుని అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై మండిపడిన విద్యార్థులు జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.
నిజాం కళాశాల విద్యార్థులపై లాఠీ చార్జి
హైదరాబాద్‌ : సమైక్యశంఖారావాన్ని అనైతికంగా వైసిపినేతలు హైదరాబాద్‌లో సభ పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ వాదులు తీవ్రస్థాయిలో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తెలంగాణలో కనీసం ప్రాతినిథ్యం లేని వైసిపి నేతలు పార్టీ తెలంగాణ నడిబొడ్డుగా ఉన్న హైదరాబాద్‌లో సభ పెట్టడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు అడ్డుకుంటామని మొదటి నుంచే హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. ఈకార్యక్రమాన్ని అడ్డుకునేందుకు గాను పోలీసులు భారీగా బందోబస్టు ఏర్పాటు చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం, నిజాం కళాశాల నుంచి విద్యార్థులు బయటకు రాకుండా
ఉండేందుకు భారీగా బలగాలను మొహరించారు. హాస్టల్‌లోనే నిరసన తెలుపుతున్నాకూడా విద్యార్థులను ఆందోళన చేయకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. నిరసన తెలిపి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈక్రమంలో పోలీసులకు విద్యార్థులకు మద్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హాస్టల్‌లోనే నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించి విచక్షణా రహితంగా లాఠీచార్జ్‌ చేశారు. దీంతో ఎంకి పెల్లి సుబ్బి చావుకు వచ్చిందన్న పరిస్థితి నెలకొంది. పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి ఆవరించింది.
సభలో తెలంగాణనినాదాలు
హైదరాబాద్‌ : వైఎస్సార్‌సీపీ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభకు తెలంగాణ సెగ తగిలింది. సభను అడ్డుకుంటామన్న ఓయూ జేఏసీ నేతలు అన్నంత పని చేశారు. సభా వేదిక వద్దకు చేరుకొని ‘జై తెలంగాణ’ నినాదాలతో ¬రెత్తించారు. దీంతో వారిపై సమైక్య వాదులు వాటర్‌ ప్యాకెట్లు విసిరారు. వారిపై దాడి చేసేందుకు యత్నించారు. విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేయగా.. సీమాంధ్ర వాసులు సమైక్య నినాదాలు చేశారు. దీంతో సభకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. మరోవైపు, వైఎస్సార్‌సీపీ నేత గట్టు రాంచంద్రరావు ప్రసంగిస్తుండగా.. ఓ విద్యార్థి వేదిక ముందుకు వచ్చి జైతెలంగాణ అంటూ నినాదాలు చేశాడు. సమైక్యవాదులు దాడికి యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అతడ్ని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే, సమైక్య సభను అడ్డుకొనేందుకు బయల్దేరి వెళ్తున్న ఓయూ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత తలెత్తింది. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, సమైక్య శంఖారావం సభకు వస్తున్న బస్సులను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. వరంగల్‌ జిల్లాలోని వర్ధన్నపేట, జనగాంలలో సుమారు 50 బస్సులను నిలిపివేశారు. అలాగే, హైదరాబాద్‌ శివార్లలోనూ బస్సులను అడ్డుకొనేందుకు యత్నించారు.