మోడీ సభ లక్ష్యంగా పాట్నాలో వరుస పేలుళ్లు


ఐదుగురు మృతి, 83 మందికి గాయాలు
రంగంలో దిగిన ఎన్‌ఐఏ
పాట్నా, అక్టోబర్‌ 27 (జనంసాక్షి) :
బీహార్‌ రాజధాని పాట్నా వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. రెం డు గంటల వ్యవధిలో ఏడు చోట్ల నాటు బాంబులు పేల డంతో ఐదుగురు మృతి చెందారు. 83 మంది గాయ పడ్డారు. మోడీ సభ లక్ష్యంగా పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోం ది. పేలినవి తక్కువ తీవ్రత గల బాంబులని పోలీసులు పేర్కొన్నారు. దీంతో బీహార్‌ అంతటా భద్రతతను కట్టు దిట్టం చేశారు. మరోవైపు బిజెపి ప్రధాని అభ్‌య్థి నరేంద్ర మోడీ సభకు ముందు ఈ పేలుళ్లు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో పాట్నా రైల్వేస్టేషన్‌లోని 10వ నంబరు ప్లాట్‌ ఫాం వద్ద మొదటగా నాటు బాంబు పేలింది. పేలని మరో రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత గాంధీమైదాన్‌ సవిూపంలోని సినిమా థియేటర్‌ వద్ద రెండో పేలుడు సంభవించింది. అనంతరం బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సభ జరిగే గాంధీ మైదాన్‌ ప్రాంగణంలో రెండు చోట్ల, గాంధీ మైదాన్‌ వెలుపల నాలుగుచోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో మరో ముగ్గురు గాయపడ్డారు. మొత్తం ఏడుచోట్ల వరుసగా జరిగిన నాంటుబాంబు పేలుళ్లకు సంబంధించి ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో గాంధీ మైదాన్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాట్నాలో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే హుంకార్‌ ర్యాలీలో మోడీ పాల్గొనడానికి ముందే పేలుడు రగడంతో మోడీ లక్ష్యంగా పేలుళ్లు జరిగాయని భావిస్తున్నారు. తొలుత పాట్నా రైల్వే స్టేషన్‌లో, ఆతరువాత ఓ సినిమాథియేటర్‌ వద్ద, భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సభ జరిగే గాంధీ మైదాన్‌ సవిూపంలో నాలుగుచోట్ల నాటు బాంబులు పేలాయి. బాంబు పేలుళ్ల నేపథ్యంలో నరేంద్రమోడీ సభకు భద్రతను కట్టుదిట్టం చేశారు.ఈ ఘటనతో ఎన్‌ఐఎ బృదందం పాట్నా బయలుదేరింది. పాట్నా అంతటా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. గాలింపు ముమ్మరం చేశారు.