రాహుల్ ధీమా
న్యూఢిల్లీ, అక్టోబర్ 27 (జనంసాక్షి) :
ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే మరోసారి పాగా వేయడం ఖాయమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమావేశంలో యుపిఎ ప్రభుత్వ పథకాలపై ఆయన ప్రశంసలు జల్లు కురిపించారు. ఢిల్లీ మెట్రో రైలు ప్రాజెక్టు గురించి ఇండోనేసియా వంటి దేశాలు గొప్పగా మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు. పేదరిక నిర్మూలక కోసమే కాంగ్రెస్ ఆహారభద్రతను కల్పించేందుకు కృషి చేసిందన్నారు. ఉచిత వైద్యం, విద్యాహక్కు, మౌళిక వసతులు కల్పనలో కాంగ్రెస్ ముందుందన్నారు. పేదల హక్కులను కాపాడటం ద్వారా ఢిల్లీలో వలసలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపగలిగిందన్నారు. యుపిఎ పథకాలే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కడతాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ న్యూఢిల్లీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రవాణా రంగం ప్రగతి దిశగా పయ ణించిందన్నారు. ఢిల్లీ మెట్రో రైలు ప్రాజెక్టు గురించి ఇండోనేషియా లాంటి దేశా ల్లో గొప్పగా చెప్పుకోవడం గర్వకారణమన్నారు. సుమారు 1500 కాలనీల్లో పేదవాళ్లకి సహాయం చేయడం ద్వారా వలసలను విజయవంతంగా నియం త్రించగలిగామని తెలిపారు. పేదలను చూడగానే ఎవరికైనా సహాయం చేయాల న్పిస్తుందని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రావాలని, అందుకే మేం సమాచార హక్కు చట్టం తెచ్చామని చెప్పారు. అది ప్రజలకు ఎంతో సాధికారతనిచ్చిందని తెలిపారు. మౌళిక వసతులు కల్పన గురించి ఎన్డీయే కబుర్లు చెప్పిందని, నా దగ్గర గణాంకాలున్నాయని పేర్కొన్నారు. ఎన్డీయే కన్నా మూడురేట్టు ఎక్కువ రోడ్లు మేమే నిర్మించామని, ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తున్నామని, ప్రజలు తాము దాచుకున్న సొమ్మంతా వైద్యానికి ఖర్చు పెట్టనక్కరలేదన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాగా వేస్తుంది





