
న్యూయార్క్, అక్టోబర్ 27 (జనంసాక్షి):
నరేంద్ర మోడీ భారత ప్రధానిగా దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడపలే కపో వవచ్చంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. భారత్‌లోని చాలామంది ప్రజల్లో భయాన్ని వ్యతిరేక భావనలను ప్రోత్సహించడం ద్వారా ప్రధా నిగా తాను ముందుకు నడిపించగలనని మోడీ ఆశపడనేకూడదని వ్యాఖ్యానించింది. భాజపా తన ప్రధాని అభ్యర్ధి పేర్కొంటున్న మోడీపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇలా ఘాటైన సంపాదకీయం రాయడం అరుదైన అంశంగా పేర్కొంటున్నారు. విపక్షాలతో సామరస్యంగా ముందుకెళ్లే లక్షణాలను ఆయనేమి కనపరచలేదు. అసమ్మతిని సహించే వైఖరినీ చూపలేదు. భాజపా ప్రధాని అభ్యర్థిగా మోడీన పేర్కొనడాన్ని సమ్మతించని జనతాదళ్ (యునైటెడ్) భాజ పాతో తనకున్న సుదీర్ఘ సంబంధాలను తెగతెంపులు చేసుకున్న విషయం గమనా ర్హం. ఒక్క మాటలో చెప్పాలంటే భాజ పా రాజకీయ భాగస్వాములను మోడీ ఇప్పటికే దూరంగా నెట్టేసినట్లే . భారతదేశం బహుళమతాల సమాహారం. ఇలాంటి దేశంలో కొంతమంది ప్రజల్లో భయాం ధోళ నలను, వైరాన్ని పెంచడం ద్వారా ప్రదానిగా ముందుకు తీసుకెళతానని అనుకోనేకూ డదు. అని న్యూయార్క్ టైమ్స్ సంపాద కీయం పేర్కొంది. గుజరాత్‌లో 2002లో సుమారు వెయ్యిమందిని పొట్టనపెట్టుకున్న అల్లర్లగురించి ప్రస్తావించింది. గుజరాత్ ఆర్ధిక ప్రగతి గురించి మోడీ చెప్పుకోవడాన్ని న్యూయార్క్ టైమ్స్ తీవ్రంగా ప్రశ్నించింది. ఆర్ధిక పరిస్థితి యావత్తు అద్భుతం అని చెప్పడానిక్కూడా వీల్లేదు. అని వ్యాఖ్యానిం చింది. ఉదహరణకు గుజరాత్‌లోని ముస్లిం లు దేశమొత్తం మీదున్న ముస్లింల కంటే బహుశా బాగా పేదవారు కావచ్చంది. మోడీ ఎదుగుదల అనేది చాలా మంది భారతీయులను కలవరపెడుతోంది. ముఖ్యం గా భారత్‌లోని 13.8 కోట్ల మంది ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. ఇతర మైనారిటీల్లోనూ ఇవే భావనలున్నాయి. అని సంపాదకీయం పేర్కొంది.
మోడీ భారత్‌ను సమర్థవంతంగా నడపలేకపోవచ్చు




