Monday, 2 November 2026

రాజ్యాంగబద్దంగానే రాష్ట్ర విభజన


కిరణ్‌ ఉత్తరం ఓ చిత్తుకాగితం
కేంద్రం పట్టించుకోదు
స్పష్టం చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) :
రాజ్యాంగబద్దంగానే ఆంధ్రప్రదేశ్‌ విభజన జరుగుతోందని, తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగానికి లోబడే జరుగుతున్న ప్రక్రియ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖను ఆయన చిత్తుకాగితంగా అభివర్ణించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు, కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం తెలుసునని, దానికి లోబడే వారు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కిరణ్‌ రాసిన లేఖను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తమ పార్టీ నేతల్లో విభేదాలున్న మాట వాస్తవమేనని తెలిపారు. ముఖ్యమంత్రి తెలంగాణ విషయంలో విభేదించడం కొత్తేమీ కాదన్నారు. యాభై ఏళ్లుగా నలుగుతున్న తెలంగాణ సమస్యకు కాంగ్రెస్‌ పార్టీ పరిష్కారం చూపితే మిగతా రాజకీయ పార్టీలు దాన్ని రాజకీయం చేస్తున్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *