Monday, 2 November 2026

మతమౌడ్యులు దేశంలో చిచ్చుపెట్ట చూస్తున్నరు


ఇందిరా వర్ధంతి సభలో ప్రధాని, సోనియా
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31 (జనంసాక్షి) :
మతమౌడ్యులు దేశంలో చిచ్చుపెట్ట చూస్తున్నారని ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ ఆందో ళన వ్యక్తం చేశారు. ది వంగత ప్రధాని ఇంది రా గాంధీని 29వ వర్ధంతిని గురువారం ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ‘శక్తి స్థల్‌’లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌ షిండే, కమల్‌నాథ్‌, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, వీరప్ప మొయిలీ, కృష్ణా త్రిపఠ్‌ తదితరులు తదితరులు కూడా శ్రద్ధాంజలి ఘటించారు. ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను నేతలు కొనియాడారు. 2014 ఎన్నికల్లో లబ్ధిపొందాలనే మతతత్వ శక్తులు దేశంలో అల్లర్లు సృష్టిస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రగల్చుతున్నారని తెలిపారు. ఆయా శక్తుల పట్ల ప్రజలు ఎళ్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *