
హైదరాబాద్, నవంబర్ 3 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి లేఖ రాయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంపిన లేఖపై స్పందించాల్సిన అవసరం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనకు మొదటి నుంచి వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని గతంలో కూడా వెల్లడించామని తెలిపారు. ఈ నేపథ్యంలో జీవోఎంకు విభజనపై అభిప్రాయం చెప్పాలంటూ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ రాసిన లేఖకు సమాధానమివ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జీవోఎం రాష్ట్ర విభజనకు పాటిస్తున్న విధివిధానాలపై అభిప్రాయం వెల్లడించడం అసందర్భమన్నారు.
జీవోఎంకు సీపీఎం దూరం : రాఘవులు




