Tuesday, 3 November 2026

మాఫియాగా మారిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ : నారాయణ


హైదరాబాద్‌, నవంబర్‌ 3 (జనంసాక్షి) :
ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మాఫియాగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ ఆరోపించారు. నగరంలోని మ గ్దుం భవన్‌లో ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో ప్రైవేట్‌ బస్సుల ఆగడాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ప్రవేట్‌ బస్సుల దూకుడుకు కళ్లెం వేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఆగడాలను నియం త్రించాలని కోరారు. ఒకే నంబర్‌పై నాలుగు బస్సులు తిరుగుతున్నా ప్రభుత్వం, రవాణాశాఖ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టవిరుద్దంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం వద్ద బస్సు దుర్ఘటన తర్వాత స్పందించిన ఆర్టీఏ అధికారులు అంతకుముందు ఏం చేశారని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *