‘ఆంటోని’ పార్టీ కమిటీ అన్నారు జీఓఎంకు చెప్పండంటే దాటవేస్తున్నారు
చంద్రబాబుది ద్వంద్వ విధానం : దిగ్విజయ్
న్యూఢిల్లీ, నవంబర్ 4 (జనంసాక్షి) :
తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాడని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీని లక్ష్యంగా చేసుకునే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారన్న టిడిపి వ్యాఖ్యలు సమంజసం కాదని దిగ్విజయ్‌సింగ్ అన్నారు. అన్ని పార్టీల ఆమోదంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని మరోమారు స్పష్టం చేశారు. టిడిపి ధ్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. మంత్రుల కమిటీపై టిడిపి విమర్శలు చేయడం తగదన్నారు. ఆంటోని కమిటీని పార్టీ కమిటీ అంటూ గతంలో టిడిపి వ్యతిరేకించిందని, ఇప్పుడు మంత్రుల కమిటీపై కూడా వ్యాఖ్యలు చేస్తోందన్నారు. కమిటీ వేయాలని, అఖిలపక్షం వేయాలని టిడిపి డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఉన్న అగాధాన్ని తగ్గించే భాద్యత కాంగ్రెస్‌పై ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రుల బృందానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా నివేదిక ఇస్తుందన్నారు. అఖిలపక్షంలో చెప్పదల్చుకున్న విషయాలు చెప్పి, సీమాంధ్రప్రజలకు ఎలా న్యాం చేయదల్చుకున్నారో సూచించాలన్నారు. ఇరు ప్రాంతాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. టిఆర్ఎస అదినేత కెసిఆర్ చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు సరికాదన్నారు. కేసీఆర్ తాను చెప్పదలచుకున్నది ఏదైనా ఉంటే జీవోఎంకు చెప్పుకోవచ్చని దిగ్విజయ్ సింగ్ అన్నారు. అంతేకానీ అనవసర వ్యాఖ్యలు చేయరాదని ఆయనతెలిపారు. అన్ని పార్టీలను సంప్రదించాకే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా జీవోఎంకు నివేదిక ఇస్తుందన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఉన్న అగాధాన్ని తగ్గించే బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. టీడీపీని లక్ష్యంగా చేసుకునే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందనటం సమంజసం కాదని దిగ్విజయ్ అన్నారు. గతంలో ఆంటోనీ కమిటీని పార్టీ కమిటీ అంటూ టీడీపీ గతంలో వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు.