
సికింద్రాబాద్, నవంబర్ 4 (జనంసాక్షి) :
రక్షణ కల్పించాల్సిన జవాన్లే మానవ మృగాలుగా మారారు. ఓ యువతిపై ముగ్గు రు జవాన్లు అత్యాచారయత్నానికి ఒడిగ ట్టారు. సికింద్రాబాద్ పరిసర ప్రాం తాల్లో స్నేహితుడితో కలిసి ఉన్న యువతిపై ముగ్గురు జవాన్లు కన్నేశారు. ఆ యువకుడిని బెదిరించి యువతిని ఎత్తుకెళ్లారు. ఈ దురాఘతానికి పాల్పడిన ముగ్గురు జవాన్లపై యువతి స్నేహితుడు తుకారం గేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆర్మీ జవాన్లపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహేంద్రహిల్స్‌లోని సాయిబాబా గుడి నుంచి వస్తున్న యువతిని ఆమె స్నేహితుడ్ని రాత్రి పది గంటల సమయంలో జవాన్లు అడ్డుకున్నారు. యువకుడిని కొట్టి ఆమెను పొదల్లోకి ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి యువకుడు పరుగెత్తుకెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని రక్షించారు. ఆర్మీ జవాన్లను అదుపులోకి తీసుకొని బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
సికింద్రాబాద్‌లో ఘోరం యువతిపై జవాన్ల అత్యాచారయత్నం




