Tuesday, 3 November 2026

హైదరాబాద్‌పై కిరికిరి వద్దు


తాత్కాలికంగానే ఉమ్మడి రాజధాని
శాంతిభద్రతలు తెలంగాణ సర్కారుకే
జీఓఎంకు ఎంఐఎం నివేదిక
హైదరాబాద్‌, నవంబర్‌ 4 (జనంసాక్షి) :
హైదరాబాద్‌పై ఎలాంటి కిరికిరి వద్దని, ప్రజల ఆకాంక్షమేరకు పది జిల్లాలతో కూ డిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయా లని ఎంఐఎం జీవోఎంను కోరింది. ఈమే రకు సోమవారం లేఖ రాసింది. హైద రాబాద్‌ ఆంక్షలు అంటే ఊరుకునేది లేదని, తెలంగాణ ప్రభుత్వానికే అన్ని అధికా రాలుండాలంటూ కోరింది. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితులపై సూచనలు, సలహా లు ఇవ్వాల్సిందిగా రాష్ట్రంలోని ఎనిమిది గుర్తింపు పొందిన పార్టీలకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. ఇందులో భాగంగా ఎంఐఎం నివేదికను రూపొందించింది. నవంబరు ఐదో తేదీ వరకు అన్ని పార్టీలు నివేదికలు ఇవ్వాలని కేంద్రం గడువు పెట్టింది. దీంతో సోమ, మంగళవారాల్లో మెయిల్‌ ద్వారా జీఎంఓకు నివేదిక పంపనుంది. హైదరాబాద్‌ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు సిడబ్ల్యుసీతో పాటు యూపీఏ సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కూడా కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్‌పై ఆంక్షలు వద్దని ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు కొనసాగించాలన్న నిర్ణయాన్ని కూడా తప్పుబట్టింది. తాత్కాలికంగా రెండు, మూడేళ్ల పాటు ఉంచడంతో పాటు సీమాంధ్రలో కొత్తరాజధాని నిర్మాణం ప్రక్రియను వేగవంతం కూడా చేయాలని ఎంఐఎం కోరింది. గతంలో మద్రాస్‌ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ముంబయి నుంచి గుజరాత్‌ విడిపోయినప్పుడు, మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌ నుంచి జార్ఖండ్‌లు విడిపోయినప్పుడు ఉమ్మడి రాజధాని అనే ప్రస్తావన రాలేదని, నూతన రాజధానిలోనే ఏర్పాటు చేసిన విషయాన్ని ఎంఐఎం తన నివేదికలో ప్రస్తావిస్తుంది. చాలా కాలం ఉమ్మడి రాజధాని ఉంటేనే ఇటువంటి ప్రతిపాదనలు తెరపైకి వస్తాయని, ఇదే లేకుంటే హైదరాబాద్‌తో ఎటువంటి ఆంక్షలు ఉండవని భావిస్తున్న ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర సమితి అభిప్రాయంతో ఏకీభవించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఎంఐఎం కోరబోతున్న అంశాలతోనే జీఓఎంకు నివేదిక సమర్పించబోతోంది. దీంతో ఈ రెండు పార్టీల నివేదికలు దాదాపుగా సమాంతరంగా ఉండనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *