
అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో సీఎం
హైదరాబాద్, నవంబర్ 5 (జనంసాక్షి) :
యువకులు పొలం బాట పట్టాలని ముఖ్యమంత్రి కిర ణ్‌కుమార్ రెడ్డి అన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న యువత వ్యవసాయంలోనూ రాణించాలని ఆకాంక్షించారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం హాజరయ్యారు. వ్యవసాయం రంగంవైపు యువత మొగ్గు చూపకపోవడంతో భవిష్యత్ ఆందోళనకరంగా మారబోతోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. వర్షాలు, ప్రకృతి విపత్తులు రైతును దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు, విత్తనాల ధరలు పెరడగం వల్ల పెట్టుబడులు పెరిగాయన్నారు. రైతులకు పెట్టుబడి రాయితీ ఇస్తున్నా అవి సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వాల కృషి ఫలితంగానే గతంలో కంటే రైతులకు రుణపరపతి మెరుగైందని పేర్కొన్నారు. వ్యవసాయం రంగంలో కమతాల పరిమాణం తగ్గిపోవడం ఆందోళనకరంగా ఉందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతులకు పెట్టుబడులు ఇబ్బందిగా మారాయని సీఎం పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాల ధరలు పెరగడం వల్ల రైతులకు పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. రైతును అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులు దెబ్బతీస్తున్నాయని తెలిపారు. పంటల బీమా విధానంలో మౌలిక మార్పులు రావాలన్నారు. వ్యవసాయ రంగం వైపు యువత రాకపోవడం భవిష్యత్ సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. విద్యావ్యవస్థలోనూ వ్యవసాయంపై అవగాహన కల్పించే పాఠ్యాంశాలు ఉండాలని సీఎం సూచించారు. రుణాల కోసం బ్యాంకులపై ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తున్నాయని చెప్పారు. కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి తారీఖ్ అన్వర్ రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రామిరెడ్డి, పితాని సత్యనారాయణ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ఈ మూడురోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో 400 మంది దేశీయ, విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ వ్యవసాయ సదస్సు సందర్భంగా హైటెక్స్‌లో ఏర్పాటుచేసిన అగ్రిటెక్ ట్రేడ్ ఫెయిర్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రి వ్యవసాయ సహాయమంత్రి తారీఖ్ అన్వర్ ప్రారంభించారు.
యువకులు పొలంబాట పట్టండి




