Tuesday, 3 November 2026

సమన్యాయం పేర బాబు కొత్త డ్రామా


విభజన ఆపాలని ప్రధానికి లేఖ
హైదరాబాద్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి) :
సమన్యాయం పేరిట తెలు గుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు మరో కొత్త డ్రామాకు తెరలేపారు. మూడు ప్రాంతాల అబి óప్రాయాలు తీసుకున్నాకే విభజన చేయాలని, అప్పటి వరకు విభజన ప్రక్రియ ఆపాలని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. తన నివాసంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలతో సుదీర్ఘభేటీలో బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీమాంధ్ర ఎంపీ కొనకళ్ల చెప్పారు. విభజనపై శ్రీ కృష్ణ కమిటీలోని ఐదో ఆప్షన్‌ అమలు చేయాలని లేఖలో పేర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోవడం విశేషం. కాగా, తన రాజకీయ భవిష్యత్‌ కోసం పూటకోమాట మారుస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు సమన్యాయం పేరిట మరో నాటకానికి తెరలేపడంపై పలువురు తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *