నెలాఖరుకు తెలంగాణ బిల్లు


అసెంబ్లీకి తీర్మానం రాదు.. బిల్లు మాత్రమే
విభజన ప్రక్రియ చకచకా
సీమాంధ్రకు ప్యాకేజీ
డిసెంబర్‌ 9న పార్లమెంట్‌ ఆమోదం
జీవోఎంలో కీలక అంశాలపై చర్చ
హైదరాబాద్‌్‌, నవంబరు 7 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఈ నెలాఖ రులోగా పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభు త్వం చకచకా పావులు కదుపుతోంది. గురువారం నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తూ డిసెంబరు 9 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటోంది. డిసెంబరు 7న అన్ని ప్రక్రియలు పూర్తయి పార్లమెంట్‌ ముందుకు తెలంగాణ బిల్లు రావడమే కాకుండా 9వ తేదీ నాటికి ఆమోదం పొందాలని పట్టుదలతో అటు కాంగ్రెస్‌, ఇటు కేంద్రం దూసుకుపోతున్నాయి. గురువారం కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన మంత్రుల సంఘం మూడవసారి సమావేశం అయింది. మంగళవారం రోజే గడువు ముగియడంతో వివిధ శాఖలు, పార్టీలు, సంస్థలు ఇచ్చిన నివేదికలను జీఓఎం పరిశీలించి అందులోని కొన్ని అంశాలను గుర్తించింది. విభజనకు సంబంధించిన ముసా యిదా నివేదికను రూపొందిస్తారు. శుక్రవారం కాంగ్రెస్‌ రాష్ట్ర సమన్వయ భేటీ ఢిల్లీలోనే నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అధ్యక్షత వహించనున్నారు. సీఎం కిరణ్‌కమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి చిరంజీవి తదిత రులు పాల్గొననున్నారు. అయితే అఖిలపక్ష సమావేశాన్ని కాంగ్రెస్‌ అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్పాలన్న దానిపై ఒక నిర్ణయానికి రానున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానంపై ధిక్కారస్వరం పెంచిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని దారిలోకి తెచ్చేందుకు చివరి ప్రయత్నం కూడా కాంగ్రెస్‌ పెద్దలు చేస్తున్నారు. విభజనపై కిరణ్‌ ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. ఆయన మాటలు నీటిమూటలేనని తేలిపోయాయి. సమన్వయ భేటీలో పాల్గొనాలంటూ దిగ్విజ య్‌సింగ్‌ అందరికి స్వయంగా ఆహ్వానించినా ముఖ్యమం త్రికి మాత్రం బొత్సతో ఆహ్వానించడం విశేషం. ఈనెల 12న రాజకీయ పార్టీల అభిప్రాయం కోసం చివరిసారిగా అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లోనే జీఓఎం నాలుగోసారి సమావే శమై తెలంగాణ బిల్లు ముసాయిదాను ఖరారు చేస్తోంది. అనంతరం రెండు రోజుల తర్వాత 14న గురువారం కేంద్ర కేబినెట్‌ భేటీ అవుతోంది. ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన ఇతరత్రా అంశాలతో పాటు హైదరాబాద్‌ ప్రతిపత్తిపై నిర్ణయం తీసుకొని జీఓఎం ఇచ్చే ముసాయిదా బిల్లుకు ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. వెంటనే 15వ తేదీన ఈ ముసాయిదాకు సంబంధించిన అవసరమైన విధివిధానాలకు సంబంధించిన కేబినెట్‌ ఆమోదించిన కేంద్రం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపనుంది. అయితే, రాష్ట్రపతి ఇప్పటి వరకు వ్యక్తం చేసిన అనుమానాలు, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, పలువురు సీమాంధ్ర, తెలంగాణ నేతలు ఆయనకు రాసిన లేఖలను ఇప్పటికే కేంద్రహోంశాఖకు పంపించారు. ఆయన వ్యక్తంచేసిన అనుమానాలకు కూడా తెలంగాణ బిల్లు ముసాయిదాలోనే జవాబు ఇచ్చే అవకాశం ఉంది. అనంతరం రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం బిల్లు ముసాయిదాను రాష్ట్ర శాసనసభకు అభిప్రాయం కోసం పంపించాలి. అయితే ఎప్పుడు రాష్ట్రపతి శాసనసభకు పంపుతారో అనే విషయంపై ఇంత వరకు స్పష్టత రాలేదు. సాధారణంగా అసెంబ్లీ స్పీకర్‌ బిల్లు ముసాయిదా అందగానే అందరిని సమావేశపరచాలి. అందులో ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు సేకరించాలి. వాటిని క్రోడీకరించి మళ్లీ స్పీకర్‌ రాష్ట్రపతికి పంపుతారు. డిసెంబరు 5న శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానుండంతో రాష్ట్రపతి ఈ ప్రక్రియ అంత పూర్తి చేసి కేంద్ర హోంశాఖకు పంపాలి. డిసెంబరు 7వ తేదీన పార్లమెంట్‌ ముందుకు తెలంగాణ బిల్లు రావడం సోనియా పుట్టిన రోజైన 9వ తేదీన బిల్లు ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది.

గురువారం నిర్వహించిన జీవోఎం సమావేశం తర్వాత కేంద్ర¬ంమత్రి సుశిల్‌కుమార్‌ షిండే మీడియాతో మాట్లాడారు. సకాలంలోనే తెలంగాణ బిల్లును అసెంబ్లీకి పంపుతామన్నారు. తెలంగాణ బిల్లు సరైన సమయంలో అసెంబ్లీకి వెళ్తుందని, బిల్లులోనే సీమాంధ్రకు ప్యాకేజీని చేరుస్తామన్నారు. హైదరాబాద్‌, ఆర్టికల్‌ 371(డి)పై స్పష్టత రాలేదన్నారు. అందుకే అన్ని విషాయాలను సమగ్రంగా పరీశీలిస్తున్నామని చెప్పారు. ఈనెలాఖరులోగా మంత్రుల కమిటీ పని పూర్తవుతుందన్నారు. ఈ నెల చివరికల్లా రాష్ట్ర ఏర్పాటు అంశంపై జీఓఎం నివేదిక సమర్పిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి తప్పక పంపుతామని తెలిపారు. హైదరాబాద్‌ నగర అంశాన్ని కూడా ఇందులోనే పొందుపరిచి బిల్లును పంపుతామన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి మంచి ప్యాకేజీని కేంద్రం ఇస్తుందని షిండే తెలిపారు. అంతకు ముందు పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ భేటీ- అనంతరం విూడియాతో మాట్లాడిన జేడీ శీలం విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల నుంచి తప్పక సహకారం లభిస్తుందని తెలిపారు. ఆమోదకరమైన ప్యాకేజీని ఇచ్చి సీమాంధ్ర ప్రజలను విభజనకు ఒప్పిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని తెలిపారు.

మంత్రుల బృందం తదుపరి సమావేశం 11న

రాష్ట్ర విభజనపై ఏర్పడ్డ మంత్రుల బృందం సమావేశం ముగిసింది. గంటకు పైగా సమావేశమైన బృందం పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. మంత్రుల బృందం తిరిగి ఈ నెల 11న ఉదయం 10.30 గంటలకు సమావేశం కానుంది. ఇప్పటికే పలు అంశాలను చర్చించిన ఈ బృందం మరోమారు సమావేశంలో మరిన్ని అంశాలను చర్చించనుంది. ఈనెల 12 ఐదు రాజకీయ పార్టీలు, 18న రాష్ట్ర మంత్రులతో మంత్రుల బృందం సమావేశం కానుంది. జీవోఎంకు మొత్తం 18 వేల వినతి పత్రాలు అందాయని షిండే తెలిపారు. 12న జరిగే సమావేశానికి ఒక్కో పార్టీ తరఫున ఒకరు లేదా ఇద్దరు రావచ్చని, ఒక్కో పార్టీకి 20 నిమిషాల సమయం కేటాయించామని షిండే తెలిపారు. ఇదిలావుంటే విజయ్‌కుమార్‌ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌ బృందం గురువారం కేంద్ర ¬ంమంత్రి షిండేకి నివేదిక సమర్పించింది. 29 పేజీలతో కూడిన నివేదికలో పాలనావ్యవస్థ ఏర్పడేవరకు పోలీసు అకాడమీని ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని సిఫార్సు చేసింది. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌లను, పోలీసు వైర్‌లెస్‌, పోలీసు రవాణా వ్యవస్థలను ఇరు రాష్ట్రాలు వినియోగించుకోవాలని, పోలీసు శాఖలో కొరతను బట్టి నియామకాలు జరుపుకోవాలని టాస్క్‌ఫోర్స్‌ సిఫార్సు చేసింది.