Tuesday, 3 November 2026

ఫిలిప్పీన్స్‌లో ప్రళయం

ప్రపంచంలోకెల్ల అతిపెద్ద తుపాను
మనాలీ, నవంబర్‌ 8 (జనంసాక్షి) :
ఫిలిప్పీన్స్‌లో పెను ప్రళయం సంభవించింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన తుపానులకంటే భయంకరమైన ప్రళయం వందలాది మందిని పొట్టనబెట్టుకుంది. పెను తుపాను ధాటికి శుక్రవారం నాటికి 156 మంది మృత్యువాతపడ్డారు. ఈమేరకు ఆ దేశ జాతీయ విపత్తు, ముప్పు నిర్వహణ మండలి ఒక ప్రకటన విడుదల చేసింఇ. బోహోల్‌లో 144 మంది మృతిచెందగా సెబులో 11 మంది, సిఖ్విజోర్‌లో ఒకరు మరణించినట్లు క్జిన్‌హువా ప్రకటించారు. వేలాది మంది నిరాశ్రయలయ్యారని, వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని తెలిపారు. నిరాశ్రయులైన వారిని 61 పునరావాస శిబిరాలకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *