తెలంగాణ ఏర్పాటు వేగవంతం చేయండి

ఎట్టిపరిస్థితిల్లో వచ్చే సమావేశాల్లో బిల్లు
జీవోఎంకు మేడం హుకుం
8 శాఖల కార్యదర్శులతో 4.30 గంటల పాటు మంత్రుల బృందం భేటీ
న్యూఢిల్లీ, నవంబర్‌ 11 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ మంత్రుల బృందానికి హుకుం జారీ చేసింది. పార్లమెంట్‌కు వచ్చే శీతాకాల సమావేశాల్లో ఎట్టి ప రిస్థులోనూ తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని వారిని సూచించారు. సోనియాగాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవ హారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కసర త్తులో తలమునకలై ఉన్నారు. వచ్చే నెలలో పార్ల మెంట్‌ సమావేశా ల్లో బిల్లును ప్రవే శపేట్టేలోగా జాప్యా నికి తావు లేకుం డా దానికి సంబం దించిన అన్ని లాంఛనాలను పూర్తి చేయాలని సోని యా గాంధీ ఆదేశిం చడంతో ఇటివ ల ఢిల్లీలో తెలంగాణ ప్రక్రియ ఊపం దుకుందని సమా చారం. విభజన అంశంపై ఈనెల 7వ తేదీన సమావే శమైన మంత్రుల బృందం (జీవోఎం) అదే అంశానికి సంబం ధించిన ఎనిమిది మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో సోమవారం సమావే శమైంది. 4.30 గంటల పాటు సాగిన ఈ భేటీలో విభజన నేప థ్యంలో ఆ శాఖల్లో తీసుకో వాల్సిన చర్యలపై చర్చించించారు. జీవోఎం మంగళ, బుధవారాల్లో రాష్ట్రానికి చెందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈనెల 18న రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో చివరిసారిగా సమావేశం కానుంది. అప్పటికే సిద్దమైన తెలంగాణ ముసాయిదా బిల్లును అభిప్రాయాలు చెప్పా ల్సిందిగా జీవోఎం వారి ముందు ఉంచవచ్చు. అయితే సోనియా ఆదేశాలకు లోబడి పనిచేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు, కేంద్ర మం త్రులకు సమయం తక్కువగా ఉండడంతో ప్రక్రియను పూర్తి చేయ డంలో తలమునకలై ఉన్నారు. డిసెంబర్‌ ఐదవ తేదీన పార్లమెం ట్‌కు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత, ఒకటి, రెండు రోజుల్లో ఉభయ సభల్లో బిల్లు ప్రవేశాపెట్టాలని కాంగ్రెస్‌ అధినేత్రి ఆశిస్తున్నారు. ఒకవేళ ఇతర అంశాలపై విపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నప్పటికి బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కావాల్సినంత సమయం ఉంటుందనే యోచనలో సోనియాగాంధీ ఉన్నారు. అదే సమయంలో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చేలా బిజెపిని ప్రసన్నం చేసుకోనే వ్యవహారాన్ని మంత్రుల బృందంతో పాటుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు అప్పగిస్తారు. తెలంగాణ బిల్లును రాష్ట్రపతి అసెంబ్లికి పంపించినప్పుడు విభజనను బాహటంగా వ్యతిరేఖిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దాన్ని సభలో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదనే సంగతిని ఢిల్లీలో శరవేగంగా జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చేబుతున్నాయి. రాష్ట్రపతి తెలంగాణ బిల్లును అసెంబ్లికి పంపిస్తారు. కాబట్టి అభిప్రాయాలు కోరుతూ స్పికర్‌ దాన్ని సభలో ఉంచితే సరిపోతుందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా అసెంబ్లి ఒక తీర్మానాన్ని అయితే ముఖ్యమంత్రి లేకుంటే శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రవేశపెట్టాలి. కాని ప్రస్తుతానికి అలాంటి అవసరం ఉత్పన్నం కాదు. ఇది కాంగ్రెస్‌ అధిష్టానానికి, ముఖ్యమంత్రికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి రాకుండా సాయపడుతుంది.