Tuesday, 3 November 2026

మొదటి విడత ఎన్నికల్లో మావోయిస్టుల ప్రభావం


42 కేంద్రాల్లో ఒక్క ఓటు కూడా పడలేదు
మందకొడిగా ఆరంభం.. సాయంత్రానికి 67 శాతం పోలింగ్‌
రాయపూర్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) :
ఛత్తీస్‌గఢ్‌ మొదటి విడత ఎన్నికల్లో మా వోయిస్టుల ప్రభావం స్పష్టంగా కనిపిం చింది. దండకారణ్యంలోని 42 పోలింగ్‌ కేంద్రాల్లో ఒక్కటంటే ఒక్క ఓటు కూ డా పడలేదు. భారీ భద్రత మధ్య పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రజలె వరూ ఓటు వేసేందుకు ముందుకురాలేదు. మందకొడిగా పోలింగ్‌ ప్రారం భమైనా ఓటింగ్‌ ముగిసే సరికి 67 శాతంగా నమోదైంది. చాలచోట్ల అసలు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రాలేదు. మావోయిస్టుల హెచ్చరికల ప్రభావం మొదటిదశ పోలింగ్‌పై స్పష్టంగా కనిపించిది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు 50 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. మావోయిస్టుల బెదిరింపుల నేపథ్యంలో ఉద్రిక్తతల నడుమ మందకొడిగా ఆరంభమైన పోలింగ్‌ మధ్యాహ్నానికి పుంజుకుంది. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్‌ నక్సల్‌ ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌ జిల్లాలో సోమవారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులకు మధ్య వివాదం తలెత్తింది. రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రెండు పార్టీల వారిపై కేసులు నమోదు చేశారు. జగ్దల్‌పూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న శ్యామూ కశ్యప్‌, అతని సన్నిహితులపైనా, బిజెపి అభ్యర్థి సంతోష్‌ బఫ్నా బంధువు సునీల్‌ బఫ్నాపైనా, ఇతర కార్యకర్తలపైనా కేసులు నమోదు చేసినట్లు సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. బిజెపి వర్గీయుల వాహనాలలో మద్యం సీసాలు దొరికాయని, వారిని ఆపినందుకే వివాదం తలెత్తిందని, ఈ గొడవలో కశ్యప్‌కి అతని సన్నిహితులకు గాయాలయ్యాయని, కాంగ్రెస్‌ కార్యకర్తలు చెబుతున్నారు. అయితే బిజెపికి  చెందిన సునీల్‌ బఫ్నాతో నాగర్నార్‌ పోలీసు స్టేషన్‌లో చర్చిస్తుండగా కాంగ్రెస్‌ అభ్యర్థి శ్యామూ కశ్యప్‌ అక్కడికి రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి ఉద్రిక్తతకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో ఉద్రిక్తతల మధ్య తొలివిడత పోలింగ్‌ సాగింది. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన బస్తర్‌, రాజనందగావ్‌లలోని 18 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి తొలివిడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారు పలు చోట్ల బాంబు దాడులకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలు కావడంతో భారీ బందోబస్తు మధ్య పోలింగ్‌ నిర్వహిస్తున్నా మావోయిస్టులు ఎన్నికలు అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజనందగావ్‌ నియోజకవర్గం బల్‌డోంగ్రీ గ్రామానికి ఎన్నికల సిబ్బంది వెళ్తుండగా  మార్గమధ్యంలో బాంబు పేలుడు సంభవించింది. ఒక ఐఈడీ పేలి బందోబస్తులో ఉన్న ఇద్దరు ఐటీబీపీ జవాన్లకు గాయాలయ్యాయి. కాంకేర్‌లో సోమవారం ఉదయం పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక జవానుకు గాయాలయ్యాయి. కాంకేర్‌ జిల్లా పంఖజార్‌లో మావోయిస్టులు ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. దంతెవాడ జిల్లా కిత్రిరాస్‌ పోలింగ్‌ కేంద్రంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. ధనికార్కాలో రెండు టిఫిన్‌బాక్సు బాంబులను స్వాధీనం చేసుకుని పోలీసులు నిర్వీర్యం చేశారు. అలాగే దంతెవాడ జిల్లాలోని మంగనగర్‌, సత్‌ధర్‌లలోనూ పోలీసులు 6 బాంబులను స్వాధీనం చేసుకొన్నారు. భద్రతాదళాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుకుమ, కాంకేర్‌, దంతెవాడ, నారాయణపూర్‌లలో మొత్తం 15 నుంచి 20 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ తెలిపారు. మావోయిస్టుల దాడుల నేపథ్యంలో పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం వరకూ 30 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం.  చత్తీస్గఢ్‌ శాసనసభ ఎన్నికల సందర్భంగా సుకుమా జిల్లా ఓటింగ్‌కు దూరంగా ఉంది. కిష్టారం, జేగురుకొండ, గొల్లపల్లి గ్రామాలలోని 42 పోలింగ్‌ కేంద్రాల్లో ఒక్క ఓటు  కూడా పోల్‌ కాలేదు. దంతేవాడ జిల్లా చింతల్నార్‌ సమీపంలో పోలింగ్‌ విధులకు తీసుకొచ్చిన 2 పడవలను మావోయిస్టులు   ముంచివేశారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా సుకుమా జిల్లా ఓటింగ్‌కు దూరంగా ఉంది. కిష్టారం, జేగురుకొండ, గొల్లపల్లి గ్రామాల్లోని 42 పోలింగ్‌ కేంద్రాల్లో ఒక్క ఓటు కూడా పోల్‌ కాలేదు. నారాయణపూర్‌ జిల్లా తులింగ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, సీఆర్పీఎఫ్‌ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాను మృత్యువాతపడినట్లు తెలిసింది. మావోయిస్టులు కాన్కర్‌ జిల్లాలోని పలుచోట్ల హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. సోమవారం తొలి విడత పోలింగ్‌ ఆరంభం కాకముందే రాయపూర్లో ఉదయం బాంబు పేలుడుకు ఓ జవాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టులు రెండు గ్రామాల్లో ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. ఈ రెండు సంఘటనలు నక్సల్స్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉండే బస్తర్‌ ప్రాంతం కాన్కర్‌ జిల్లాలో జరిగాయి. పోలింగ్‌ ఆరంభమైన కాసేపటికి కాన్కర్‌ జిల్లాలోని సీతాపూర్‌, కోయిల్బెడా గ్రామాల్లో మావోయిస్టులు పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. ఎన్నికల నిర్వహణకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినా అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. ఇదిలా ఉండగా, నారాయణపూర్‌ జిల్లా తులింగ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, సిఆర్పిఎఫ్‌ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు కాన్కర్‌ జిల్లాలోని పలుచోట్ల హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. సోమవారం తొలి విడత పోలింగ్‌ ఆరంభం కాకముందే రాయపూర్లో ఉదయం బాంబు పేలుడుకు ఓ జవాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టులు రెండు గ్రామాల్లో ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. ఈ రెండు సంఘటనలు నక్సల్స్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉండే బస్తర్‌ ప్రాంతం కాన్కర్‌ జిల్లాలో జరిగాయి. పోలింగ్‌ ఆరంభమైన కాసేపటికి కాన్కర్‌ జిల్లాలోని సీతాపూర్‌, కోయిల్బెడా గ్రామాల్లో మావోయిస్టులు పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. ఎన్నికల నిర్వహణకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినా అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగా పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినా ఓటర్లు ముందుకు రావడానికి జంకుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *