Tuesday, 3 November 2026

సీబీఐకి చట్టబద్దత కల్పిస్తాం


నేరాలు-పొరపాట్లకు మధ్య
తేడా గుర్తించండి : ప్రధాని మన్మోహన్‌
న్యూఢిల్లీ, నవంబర్‌ 11 (జనంసాక్షి) :
సీబీఐ చట్టబద్ధత కల్పిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవ న్‌లో మూడు రోజులపాటు కొనసాగనున్న సీబీఐ అంతర్జాతీయ సదస్సును ప్రధాని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీబీఐ చట్టబద్దతపై ఇటీవల అనేక ప్రశ్నలు తలెత్తాయని అన్నారు. పాట్నా హైకోర్టు ప్రకటనతో దీనిపై చర్చిసతున్నామని అన్నారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం కూడా నిశితంగా పరిశీలించాలని కోరారు. సీబీఐ అవసరాన్ని తెలి పేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు. సీబీఐ భవిష్యత్తు కాపాడేందుకు కృషిచేస్తామని ప్రధాని పేర్కొన్నారు. హోం మంత్రిత్వ శాఖ సీబీఐ ఏర్పాటు కోసం 1963 ఏప్రిల్‌ ఒకటో తేదీన చేసిన తీర్మానాన్ని గౌహతి హైకోర్టు కోట్టేసిన నేపథ్యంలో కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించడం, సుప్రీం కోర్టు గౌహతి హైకోర్టు తీర్పుపై  స్టే విధించిన నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *