జీవోఎంతో మొదటి రోజు హైదరాబాద్‌పై కిరికిరి వద్దు
మంత్రుల బృందంతో అఖిలపక్షం
ప్రజల ఆకాంక్ష వినిపించాం : కేసీఆర్
మంత్రుల బృందానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను విని పించామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. మం గళవారం సాయంత్రం జీవోఎంతో భేటీ అనంతరం ఆయన పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఎలాంటి ఆంక్షలు పెట్టినా ఒప్పుకోబోమని స్పష్టం చేశామన్నారు. గంటకు పైగా మంత్రుల బృందంతో వీరు భేటీ అయ్యారు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ తదితర అంశాలపై ఆంక్షలు పెడితే అది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఐదేళ్లే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరామన్నారు. మిగిలిన రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఏ విధివిధానాలు పాటించారో అవే విధానాలు తెలంగాణ ఏర్పాటుకు అనుసరించాలని కోరామన్నారు. అఖిలపక్షానికి టీడీపీ గైర్హాజరవడంపై కేసీఆర్ మండిపడ్డారు. కారణం లేకుండా ఢిల్లీలో దీక్ష చేసిన గొప్పమనిషి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌పై కేంద్ర పెత్తనం సహించం
యూటీగీటీ జాన్తానై : అసదుద్దీన్
హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని అంగీ కరించబోమని, అధికారాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. జీవోఎం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భద్రతలేదని ఆ ప్రాంత మంత్రులు తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్రులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తే ముస్లింలు, క్రిస్టియన్లకూ కల్పించాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. కేవలం ఖైరతాబాద్ మండలాన్నే ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. సీమాంధ్ర మంత్రులకు చట్టాలపై, రాజ్యాంగాలపై అసలు అవగాహన లేదని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు వచ్చిన ఇబ్బందేమి లేదన్నారు. కొన్ని విషయాల్లో సీమాంధ్ర మీడియా విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని అసద్ మండిపడ్డారు. ఆంటోనీ, జైరాం రమేష్‌లు ఇంత వరకు తమకు నివేదికలు ఇవ్వలేదని జీవోఎం తనకు చెప్పిందని కానీ సీమాంధ్ర మీడియా ఇప్పటికే ఆ రెండు కమిటీలు నివేదికలు ఇచ్చాయని, హైదరాబాద్‌పై అధికారాలన్నీ కేంద్రానికే అంటూ ప్రచారం చేయడంలో అర్థం ఏమిటని నిలదీశారు. కానీ అనవసర అంశాలను ప్రసారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన అనివార్యమైతే కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అలాగే హైకోర్టును కూడా విడదీయాల్సిందేనని కోరినట్లు చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఖరి, అభిప్రాయాలు విచిత్రంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తాము 18పేజీల నివేదికలో అన్ని విషయాలను విపులంగా జీఓఎంకు చెప్పినట్లు ఆయన వివరించారు.
పది జిల్లాల తెలంగాణే
శాంతిభద్రతలు హైదరాబాద్‌కే ఇవ్వాలి : నారాయణ
పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తాము జీవోఎంను కోరినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. జీఓ ఎంతో సమావేశం అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఎవరికీ ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, ఈ విషయంలో కేంద్రం మీడియాకు అనవసరమైన లీకులు ఇస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని నారాయణ ఆరోపించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల కోసం ఒక వ్యవస్థ ఉన్న పర్వాలేదు కానీ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండాలని సూచించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాలను కూడా కాపాడాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్దికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో తమపార్టీ వైఖరి స్పష్టంగా ఉందని, రెండు ప్రాంతాల ప్రజల అభివృద్ధి తమకు కావాలని, ఏ ప్రాంతం పట్ల వివక్ష చూపించొద్దని తాము డిమాండ్ చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జాప్యం చేయకుండా ప్రక్రియ పూర్తి చేయాలని తాము కోరామన్నారు. విజయవాడ నుంచి ఒంగోలు వరకు రాజధాని ఎక్కడైనా కట్ట్టుకోవచ్చని, ఈ విషయాన్ని చెప్పామన్నారు. చిన్నచిన్న సమస్యలను చూపించి సీమాంధ్రులు రాష్ట్ర విభజనను అడ్డుకోవద్దని ఆయన సూచించారు. భద్రాచలం కూడా తెలంగాణలో అంతర్భాగమేనని చెప్పారు. సీమాంధ్రుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన ఆరోపించారు. విభజనపై అందరి అభిప్రాయాలను చెప్పకుండానే ఇతర పార్టీలను అడగడంలో అర్థమేమి లేదన్నారు. హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడిరాజధానిగా ఏర్పాటు చేయడంలో అభ్యంతరం లేదన్నారు. యూటీ చేస్తే ఒప్పుకునేదిలేదన్నారు. విభజన అనంతరం నదీ జలాలు, పంపకాలు నిర్వహణపై స్వయం ప్రతిపత్తిగల ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని తాము కోరామన్నారు.
తెలంగాణకే కట్టుబడి ఉన్నాం : కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌తో కూ డిన తెలంగాణ ఇ వ్వాలని, సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న అ నుమానాలను నివృ త్తి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జీవోఎంతో సమావేశం అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశంలో ఏ ఇతర ప్రతిపాదనలు చేస్తే అంగీకరించమన్నారు. హైదరాబాద్ రాజధానిగా పదిజిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని తాము డిమాండ్ చేసినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో తమకు ఏమో అవుతుందని, విద్య, ఉపాధి అవకాశాలు ఉండవని సీమాంధ్ర ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతున్న దృష్ట్యా వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్రం ప్రయత్నించాలని కోరినట్లు చెప్పారు. 11అంశాలపై ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉందన్నారు. దేశంలో చిన్నరాష్ట్రాల ఏర్పాటు ద్వారానే అభివృద్ధి సాధ్యమనే అభిప్రాయంతో తాము ఉన్నామని, ఆ విధానంతోనే తెలంగాణ రాష్ట్రఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ రాజధానిగా పదిజిల్లాలతో కూడిన పార్లమెంట్లో ప్రవేశపెడితే తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో ముందు కాంగ్రెస్ విధానమేమిటో స్పష్టం చేయాలని కూడా తాము డిమాండ్ చేసినట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. అయితే జీఓఎం సమావేశంలో కేంద్ర ఆ 11అంశాలపై మీ వైఖరేమిటని మంత్రి జైరాం రమేష్ అడిగారని, అయితే స్పష్టమైన ప్రతిపాదనమేమిటో తమ ముందుంచాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. దీనిపై హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే సమాధానమిస్తూ తాము ఈ అంశాలన్నీ బిల్లులో పొందుపరుస్తామని చెప్పడంతో ముందు ఆ విషయాలన్నీ చెప్పాలని కోరామన్నారు. దీంతో ఇక మాట్లాడేదేమి లేదంటూ ఆంటోని కేవలం పది నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించారు. దీనిపై కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముందు కాంగ్రెస్ అభిప్రాయం చెప్పకుండా ఇతర పార్టీల అభిప్రాయలు అడగమేమిటని ప్రశ్నించారు. మరో సభ్యుడు హరిబాబు మాట్లాడుతూ రాజ్యాంగ ప్రకారం విభజన ప్రక్రియ పూర్తి చేయాలని, సీమాంధ్ర ప్రజలను న్యాయం చేయాలని తాము డిమాండ్ చేసినట్లు తెలిపారు.
జనవరి ఒకటికల్లా తెలంగాణ : దామోదర
జనవరి ఒకటికల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని డె ప్యూటీ సీఎం దా మో దర రాజన ర్సింహ అన్నారు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కీలకమైన 11 అం శాలపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనన్నారు. భద్రాచలంను విడదీయాలని చూస్తే సమస్యలు వస్తాయన్నారు. ఆంధ్రలో కలిపితే భవిష్యత్తులో సమస్యలు వస్తాయన్నారు. గోదావరి నదీ జలాల పంపిణీకి రెగ్యులేటరీ వ్యవస్థ అవసరం లేదని, కృష్ణాజలాల పంపిణీకి అవసరమని ఆయన పేర్కొన్నారు. 371-డి నిబంధనను అలాగే కొనసాగించాలన్నారు. 2014 జనవరి 1 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని దామోదర తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధాని చేసే విషయంలో పునరాలోచన చేయాలని దామోదర కోరారు. ఉమ్మడి రాజధాని ప్రతిపాదనను ఐదేళ్లకు కుదించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రెవెన్యూ జిల్లాను మాత్రమే కామన్ క్యాపిటల్‌గా చేయాలని, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతో సీమాంధ్రులకు పనేంటని అన్నారు. ఆర్టికల్ 371(డి)ని ఉద్యోగాల విషయంలో యథాతథంగా కొనసాగించాలని అన్నారు. సీడబ్ల్యూసీ చేసిన తీర్మానం మేరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణనే ఏర్పాటు చేయాలని కోరామన్నారు. భద్రాచలం సీమాంధ్రకు ఇస్తే అనేక సమస్యలొస్తాయని స్పష్టం చేశారు. గోదావరిపై ఎలాంటి రెగ్యులేటరీ అథారిటీ అవసరంలేదని అన్నారు. ఆంధ్రా ప్రాంతానికి అవసరమైన ప్యాకేజీ ఇవ్వాలని కోరామన్నారు.హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడం ఖాయమని ఉపముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాజధానిగానే తెలంగాణ ఏర్పడనుందని చెప్పారు. ఉమ్మడి రాజధానిని హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకే పరిమితం చేయాలని కోరినట్లు ఆయన వివరించారు.
సమస్యలు పరిష్కరించండి లేదా సమైక్యంగా ఉంచండి : వట్టి
విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, పునరాలోచన చేయాలని, అనాలోచితమని జీవోఎంకు చెప్పినట్లు మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు. మంత్రుల బృందంతో భేటీ తర్వాత ఆయన విలేరులతో మాట్లాడారు. విద్యా, ఉద్యోగ, అన్ని రంగాల్లో సీమాంధ్రులు విభజనతో నష్టపోతారని అన్నారు. హైదరాబాద్ చుట్టూ అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, వీటిని పరిష్కరించలేరని తెలిపారు. జల పంపిణీ విషయంలో సమస్యలొస్తాయని తెలిపారు. విభజనతో రెండు ప్రాంతాలకు అన్ని నష్టాలే ఎదురవుతాయని పేర్కొన్నారు. ఏ కమిటీలు, కమిషన్లు నీటి పంపిణీని పర్యవేక్షించలేవని తెలిపారు.సీడబ్ల్యూసీ నిర్ణయం ఏ రకంగానూ సమంజసంగా లేదని జీవోఎంకు చెప్పినట్లు మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు. 11 అంశాలకు సంబంధించి రాష్ట్ర విభజన వల్ల వచ్చే సమస్యలను వివరించి రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచాలని కోరానన్నారు. నిర్ణయాన్ని పునరాలోచించుకుని ఒకడుగు వెనక్కి వేయాలని జీవోఎంను కోరినట్లు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలోని సీమాంధ్ర ప్రజల ఇబ్బందులను వివరించానని వసంత్‌కుమార్ తెలిపారు.