Tuesday, 3 November 2026

తోకజాడిచ్చిన కిరణ్‌


సంగారెడ్డి రచ్చబండ రద్దు
హైదరాబాద్‌, నవంబర్‌ 12 (జనంసాక్షి)
తెలంగాణ ఉద్యమ ఉధృతికి సీఎం కిరణ్‌ తోకజాడిచ్చాడు. సంగారెడ్డిలో నిర్వహిం చతలపెట్టిన రచ్చబండను రద్దు చేసుకు న్నాడు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేటలో నిర్వహించే కార్యక్ర మంలో పాల్గొనేందుకు సీఎం సిద్ధంకాగా ఉద్యమాలు, బంద్‌ కారణంగా రద్దు చేసు కున్నారని సీఎంఓ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రాన్ని విభజిస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అనుక్షణం అడ్డుకుంటున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సన్నద్దం అవుతుండగా తెలంగాణ వాదులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టడమేకాక, బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో వెనక్కి తగ్గిన కిరణ్‌ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. సదాశివపేట రచ్చబండ కార్యక్రమాన్ని  వాయిదా వేస్తున్నట్లు అదికారులు పేర్కొన్నారు. రాష్ట్రం విభజిస్తున్న సమయంలో పక్కా సమైక్య వాదిగా ఉన్న కిరణ్‌ రావడాన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని టిఆర్‌ఎస్‌, టిజెఎసిలు ప్రకటించాయి. ఇందులో బాగంగా మెదక్‌ జిల్లా బంద్‌కు కూడా పిలుపునిచ్చాయి. ఈఆందోళనలకు తోడు హైకమాండ్‌ నుంచి మరోసారి చివాట్లు పడాల్సి వస్తుందని భవించిన కిరణ్‌ వెనక్కి తగ్గారని సమాచారం. ఇప్పటికే హైకమాండ్‌కు అందనంత దూరం అవుతూనే ఉన్నారు. దీనివల్ల మరింత దూరం పెరిగే ప్రమాదం ఉందని గుర్తించే రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా సమైక్యవాదిగా ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి పర్యటనను మాత్రం రద్దు చేయించడంలో తెలంగాణ వాదులు సఫలం అయ్యారని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *