Tuesday, 3 November 2026

కర్ణాటకలో సీమాంధ్ర విద్యార్థుల కిరాతకం


జై తెలంగాణ అన్నందుకు మెడికోపై పెట్రోల్‌పోసి సజీవ హత్యాయత్నం
60 శాతం కాలిన కామేశ్‌.. పరిస్థితి విషమం
మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 13 (జనంసాక్షి) :
కర్ణాటకలో సీమాంధ్ర విద్యార్థులు కిరాతకానికి పాల్పడ్డారు. జై తెలంగాణ అని నినదించి తన ఆకాంక్షను చాటిన మెడికోపై పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేసేందుకు యత్నించారు. వారి దుర్మార్గానికి బలైన మెడికో 60 శాతం కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తెలుగువాళ్లు, తెలుగుతల్లి, తెలుగుజాతి అంటూ నీతులు వళ్లించే సీమాంధ్రులు ఎంతటి దుర్మార్గాలకు పాల్పడుతారో ఈ ఘటన మచ్చు తునక మాత్రమే. వివరాలు ఇల్లా ఉన్నాయి.. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తికి చెందిన కామేశ్‌ కర్ణాటకలోని కోలార్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ దిత్వీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు కామేశ్‌ తోటి విద్యార్థులతో మాట్లాడుతూ, ఇక తాము తెలంగాణ సాధించుకున్నామని త్వరలోనే తమ బతుకులు బాగుపడతాయని అన్నాడు. ఆ మాటలు జీర్ణించుకోలేని అనంతపురం విద్యార్థ్థులు అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పటించారు. విషయం తెలుసుకున్న కళాశాల అధికారులు కామేశ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *