Tuesday, 3 November 2026

సంపూర్ణ తెలంగాణే కావాలి


సీఎం రిపోర్టు 13 జిల్లాల సర్కారులా ఉంది : కోదండరామ్‌
న్యూఢిల్లీ, నవంబర్‌ 13 (జనంసాక్షి) :
సంపూర్ణ తెలంగాణ రాష్ట్రమే కావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణకు దక్కాల్సిన అధికారాలు, వనరుల విషయంలో అన్యాయం జరిగితే ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టే విషయంలో మరోసారి హస్తినకు వస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక 13 జిల్లాలకు మాత్రమే సంబంధించినట్లుగా ఉందని ఆయన చెప్పారు. సంపూర్ణమైన తెలంగాణ సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. సిఎం నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని వేరుగా చెప్పాల్సిన పనిలేదన్నారు. తెలంగాణకు దక్కాల్సిన అధికారాలు, వనరుల విషయంలో అన్యాయం జరిగితే వూరుకోమని ఆయన అన్నారు. సంపూర్ణమైన తెలంగాణ సాధనకు తమ ప్రయత్నం కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఏర్పడే వరకు, అదీ ఆంక్షలు లేని తెలలంగాణ ఏర్పడే వరకు అప్రమత్తంగా ఉంటామన్నారు. ఎక్కడ తేడా వచ్చినా అంగీకరించబోమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *