Wednesday, 4 November 2026

పొయ్యేకాలం జీవోఎంకు వెళ్లకూడదని కిరణ్‌ కిరికిరి

హైదరాబాద్‌, నవంబర్‌ 14 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటికి పోయే సమయం దగ్గరపడింది. మంత్రుల బృందం గురువారం రాత్రి 8 గంటలకు రావాలని ఆహ్వానించినా ఢిల్లీ వెళ్లకుండా మరోసారి ధిక్కారస్వరం వినిపించారు. షెడ్యూల్‌ ప్రకారం గురువారం రాత్రి 8గంటలకు ముఖ్యమంత్రి హోదాలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి జీవోఎం ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే విభజన ఖాయమని సంకేతాలు వెలువడుతున్న తరుణంలో జీవోఎం ముందుకు వెళ్లి విభజనకు అంగీకరించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయోమోనన్న అనుమానంతో కిరణ్‌ మనసు మార్చుకున్నారు. ఇంత దూరం వచ్చాక ఇక తనను చేసేదేమిలేదనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. రాష్ట్రంలో ఇప్పటికే రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విశాఖకు జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ ముందే ఖరారైంది. అయితే, బుధవారం సాయంత్రం వరకు ఢిల్లీ వెళ్లాలని ఆలోచించిన పలువురు సన్నిహితులతో మంతనాలు జరిపిన కిరణ్‌ ఎట్టకేలకు ఢిల్లీ వెళ్లవద్దని సూచించారు. దీంతో ఆయన రచ్చబండకు యథాతథంగా హాజరుకావాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ఈ నెల 18వ తేదీ వరకు ఢిల్లీలో ఉండడం లేదు. అయితే, ఆయన వచ్చాకే మళ్లీ కిరణ్‌కుమార్‌ రెడ్డి ఢిల్లీకు వెళ్లే తేదీ ఖరారు కావాల్సి ఉంటుంది. ఈ నెల 18వ తేదీన కూడా జీఓఎం సమావేశం కానుంది. ఆ సమావేశానికి కూడా ముఖ్యమంత్రి హాజరవుతారో లేదా వేచిచూడాల్సి ఉంది. అయితే మనీశ్‌తివారి హైదరాబాద్‌కు వస్తున్నందున ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *