Wednesday, 4 November 2026

కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం

ఏడుగురి సజీవ దహనం
హైదరాబాద్‌, నవంబర్‌ 14 (జనంసాక్షి) :
మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం వద్ద ప్రమాదవశాత్తు జరిగిన బస్సు ప్రమాదంలో 45మంది సజీవ దహనం అయిన ఘటన మరవకముందే కర్నాటక రాష్ట్రంలో కూడా మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు సజీవదనహం కాగా, 25మంది తీవ్రం గాయపడ్డారు. హవేలి సమీపంలోని కొర్రిమల్లహల్లి వద్ద ఈ ఘటన జరిగింది. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 140కి.మీ వేగంతో వెళుతోంది. ఒక్కసారిగా బస్సు రోడ్డు పక్కన వున్న డివైడర్‌ను ఢీకొనడంతో టైరు పేలి పోయి మంటలు చెలరేగాయి. అందరి గాఢ నిద్రలో ఉండగా ఈ జరగడంతో ఎవరికీ పాలుపోలేదు. అప్పుడు బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. చివరకు ధైర్యం చేసి కొందరు అద్దాలు పగులగొట్టుకొని ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏడుగురు మాత్రం బయటకు రాలేక మంటల్లో చిక్కుకొని ప్రాణాలు వదిలారు. గాయపడిన వారిని హుబ్లీ, హవేలి ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. హవేలి జిల్లా ఎస్పీ శశికుమార్‌ వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి పంపే ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచే సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్దమైంది. అతివేగమే తమ కొంపు ముంచిందంటూ ప్రయాణికులు మీడియాకు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *