Wednesday, 4 November 2026

అంతా కిరికిరే

నక్సలిజం పెరుగుతుంది
కరెంట్‌ ఉండదు
ఉద్యోగులు, నీళ్ల సమస్య
సమైక్యంగా ఉంచండి
జీవోఎంకు కిరణ్‌ వినతి
న్యూఢిల్లీ, నవంబర్‌ 18 (జనంసాక్షి) :
జీవోఎంతో భేటీలోనూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అవే కిరికిరి మాటలు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే నక్సలిజం పెరుగుతుందని, కరెంట్‌ ఉండదని, ఉద్యోగులు, నీళ్ల సమస్యలు తలెత్తుతాయని ఏడుపును ఏకరువు పెట్టాడు. జీవోఎంతో భేటీ అనంతరం ఏపీ భవన్‌ లో సీఎం మీడియాతో మాట్లాడారు. విభజన వల్ల కలిగే నష్టాలను జివోఎంకు వివరించానని, దీనికి సంబంధించి ఓ నివేదిక సమర్పించానని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ వెనకబాటుకు లక్షల కోట్ల ప్యాకేజీలు ఇచ్చి ఆదుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. అందుకే విభజన వద్దని, మరోమారు ఆలోచించుకోవాలని సూచించామన్నారు. పమతతత్వం, నక్సలిజం పెట్రేగే అవకాశాలున్నాయని కిరణ్‌ చెప్పారు. నక్సలైట్‌ నాయకుల్లో 80 శాతం మంది అగ్రనాయకులు ఆంధప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారే అని చెప్పారు. రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాలలో నక్సలిజం సమస్య భారీగా పెరుగుతుందని అన్నారు. ఇది జాతీయ భద్రతకు కూడా ముప్పుతెస్తుందని తెలిపారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కోరినట్టు సీఎం తెలిపారు. జీవోఎంకు అన్ని వివరాలతో రెండు పుస్తకాలు అందజేశానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. విభజన వల్ల ప్రధానంగా రెండు సమస్యలు వస్తాయన్నారు. విద్య, వైద్య అంశాలపై తీవ్ర ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అంశంలో 371-డి పై కూడా సమస్యలు వస్తాయన్నారు. విభజన వల్ల నక్సలిజం పెరిగే ఆస్కారముందన్నారు. భద్రత అంశాలకు సంబంధించిన విషయాలను నివేదికలో జీవోఎంకు ఇచ్చామన్నారు. 2006 నుంచి ప్రభుత్వాలు నక్సలిజాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. దేశానికి నక్సలిజం ప్రధాన సమస్య అని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా పలుమార్లు చెప్పిన విషయం గుర్తుచేశారు. ఉగ్రవాదుల దాడులు కూడా 2001 నుంచి ఎక్కువయ్యాయన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరానని ఆయన చెప్పారు.ఫార్మా, సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలలో 80 శాతం హైదరాబాద్‌ లోనే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే పారిశ్రామిక, ప్రైవేటు ఉద్యోగాల పంపిణీ విషయంలో కూడా తీవ్ర సమస్యలు తలెత్తుతాయని అన్నారు. రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం వల్ల ఇరు ప్రాంతాల్లో పోలీసుల సంఖ్య తగ్గిపోయి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని సీఎం తెలిపారు. దీంతో, మత తత్వ శక్తులు, నక్సలైట్లు రెచ్చిపోతారని అభప్రాయపడ్డారు. దేశానికున్న అతి పెద్ద సమస్యల్లో నక్సలిజం కూడా ఒకటని సాక్షాత్తూ ప్రధాన మంత్రి మన్మోహన్‌ చెప్పారని గుర్తుచేశారు. ఒక లెటర్‌తో పాటు అన్ని వివరాలతో రెండు పుస్తకాలను జీవోఎంకు సమర్పించామని ఈ సందర్భంగా సీఎం కిరణ్‌ తెలిపారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఎన్నో సమస్యలు తలెత్తుతాయని జీవోఎంకు స్పష్టం చేశామని తెలిపారు. అన్ని వసతులు హైదరాబాద్‌ లోనే ఉన్నందువల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పినట్టు తెలిపారు. రాజధాని, ఆర్టికల్‌ 371-డీ విషయంలో చాలాసమస్యలు వస్తాయని చెప్పారు. సాగునీటి విషయంలో ఇరు ప్రాంతాల్లో సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. విభజనతో సాగునీటి సమస్య తీవ్రరూపం దాలుస్తుందని సీఎం కిరణ్‌ తెలిపారు. జీవోఎంతో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ట్రైబ్యునల్స్‌ ఉన్నా కృష్ణా, గోదావరి మిగులు జలాలను కర్ణాటక, మహారాష్ట్రలు వాడుకుంటున్నాయని జీవోఎంకు చెప్పినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు మిగులు జలాల లభ్యత మేరకు ఇప్పటికే అనేక ప్రాజెక్టులను చేపట్టామని చెప్పారు. శ్రీశైలం కింద 74 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే పులిచింతల కూడా పూర్తకాబోతోందని సీఎం అన్నారు. కృష్ణా డెల్టాలో నాగార్జునసాగర్‌ కింద ఆంధ్రలో 30 లక్షల ఎకరాలు, తెలంగాణలో 20 లక్షల ఎకరాలు సాగవుతోందని సీఎం తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే నదీ జలాలను సమన్వయంతో వాడుకునే వీలుంటుందని తెలిపారు. ఇరు ప్రాంతాల మధ్య నీటి సమస్యలు వస్తే పరిష్కరించడానికి ఎలాంటి బోర్డులు కూడా లేవని గుర్తుచేశారు. మిగుల జలాల సమస్య తలెత్తుతుందని చెప్పారు. కృష్ణా నదిని రెండు రాష్టాల్రు పంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని సీఎం చెప్పారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కోరినట్టు సీఎం తెలిపారు. ఫార్మా, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో 80 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే పారిశ్రామిక, ప్రైవేటు ఉద్యోగాల పంపిణీ విషయంలో కూడా తీవ్ర సమస్యలు తలెత్తుతాయని అన్నారు. రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం వల్ల ఇరు ప్రాంతాల్లో పోలీసుల సంఖ్య తగ్గిపోయి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని సీఎం తెలిపారు. దీంతో మతతత్వ శక్తులు, నక్సలైట్లు రెచ్చపోతారని అభప్రాయపడ్డారు. దేశానికున్న అతి పెద్ద సమస్యల్లో నక్సలిజం కూడా ఒకటని సాక్షాత్తూ ప్రధాన మంత్రి మన్మోహన్‌ చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ప్రాంతం తీవ్ర విద్యుత్‌ సమస్యను ఎదుర్కొంటుందని సీఎం కిరణ్‌ తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో విద్యుత్‌ వినియోగంలో కేవలం 50 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతోందని మిగతా 50 శాతం సీమాంధ్ర ప్రాంతం నుంచి వస్తోందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో 175 మిలియన్‌ యూనిట్ల అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుందని దీనికోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. విలేకర్ల సమావేశంలో మంత్రులు శైలజానాథ్‌, టిజి వెకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *