న్యూఢిల్లీ, నవంబర్ 18 (జనంసాక్షి) :
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై భారతీయ జనతా పార్టీ మద్దతు దారునని చెప్పుకున్న ఒక వ్యక్తి సోమవారం నల్ల ఇంకు చల్లాడు. ఢిల్లీలో కేజ్రివాల్ ఓ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. మహారాష్ట్రకు చెందిన తన పేరు నచికత అని ఆ వ్యక్తి తెలిపాడు. అన్నాహజారే పేరును కేజ్రివాల్ తప్పుగా ఉపయోగించుకుంటున్నాడనే కోపంతోనే ఇలా చేసినట్లు చెప్పాడు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్లు అన్నాను మోసం చేశారని, జన్ లోక్‌పాల్ ఉద్యమానికి అన్యాయం చేశారని అతడు ఆరోపించారు. మొదట తాను అన్నా మద్దతుదారుడినేనని చెప్పిన ఆ వ్యక్తి తర్వాత భాజపా కార్యకర్తనని చెప్పడం గమనార్హం.
కేజ్రీవాల్‌పై భాజపా సిరా దాడి




