Tuesday, 3 November 2026

మూడో అంతర్జాతీయ బ్రిక్స్‌ సదస్సు ప్రారంభం

న్యూఢిల్లీ, నవంబర్‌ 21 (జనంసాక్షి) :
బ్రిక్స్‌ దేశాల మూడో అంతర్జాతీయ కాంపిటీషన్‌ సదస్సు (ఐసిసి) న్యూఢిల్లీలో గురువారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ గురువారం ఉదయం ప్రారంభించారు. ‘బ్రిక్స్‌ దేశాలలో పోటీతత్వం అమలు : సమస్యలు, సవాళ్లు’ అన్న అంశంపై ఈ మూడవ బ్రిక్స్‌ ఐసిసి సదస్సులో చర్చించారు. బ్రిక్స్‌ కూటమిలోని దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై బలమైన చర్చలు జరిగేందుకు ఈ రెండు రోజుల సదస్సు దోహదపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖమంత్రి సచిన్‌ పైలెట్‌, కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) చైర్మన్‌ అశోక్‌ చావ్లా ఈ సదస్సులో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *