దేశంలో విధ్వంసానికి భారీ కుట్ర
నిఘా విభాగం అప్రమత్తంగా ఉండాలి
సోషల్‌మీడియా అగ్నికి ఆజ్యం పోయొద్దు
ప్రధాని మన్మోహన్‌సింగ్
న్యూఢిల్లీ, నవంబర్ 23 (జనంసాక్షి) :
దేశంలో భారీ విధ్వంసానికి కుట్రలు జరుగుతున్నాయని ఇలాంటి సమయంలో నిఘా విభాగం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన డీజీపీలు, ఐజీల కాన్ఫరెన్స్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ రక్షణ విషయంలో భద్రతా దళాలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ క్రైమ్ నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందన్నారు. మావోయిస్టుల అణచివేతకు పారామిలటరీ బలగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ప్రధాని అన్నారు. దర్యాప్తు సంస్థల పనితీరు కూడా మెరుగు పడుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో సోషల్‌మీడియా వ్యవహరిస్తున్న తీరు అగ్నికి ఆజ్యం పోసేలా ఉందని, దీనిని మార్చుకోవాలని హితవు పలికారు. కేవలం సోషల్‌మీడియా వల్ల కొన్ని వివాదాలు పెరిగి పెద్దవైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సున్నితమైన అంశాలు, ప్రజల మధ్య విధ్వేషాలు రగల్చగల విషయాలపై సోషల్‌మీడియా స్వీయ నియంత్రణ పాటిస్తే మంచిదన్నారు. దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా నిఘా సంస్థలు ఎళ్లవేళలా అపమ్రత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే రానున్న సాధారణ ఎన్నికలకు తీవ్రవాదులు అడ్డంకులు సృష్టిచే అవకాశాలున్నాయని ప్రధాని అన్నారు.





