Tuesday, 3 November 2026

ప్రజాహితం కోసమే సరికొత్త చట్టాలు


కమలనాథులు ఏం చేశారు

సోనియా సూటి ప్రశ్న

కోటా, నవంబర్‌ 23 (జనంసాక్షి) :

ప్రజలకు మంచి చేసేందుకే సరికొత్త చట్టాలు రూపొందిస్తున్నామని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు. శనివారం రాజస్థాన్‌లోని కోటాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోందని తెలిపారు. గత ఐదేళ్లలో రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలోని తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిందని తెలిపారు. రాజస్థాన్‌ ప్రధాన విద్యాకేంద్రంగా కీర్తిగాంచిందని అన్నారు. జోథ్‌పూర్‌లో ఐఐటీ ఉదయ్‌పూర్‌లో ఐఐఎం, అజ్మీర్‌లో కేంద్రియ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గెహ్లాట్‌ ప్రభుత్వం చేపట్టిన ఉచిత మందుల పంపిణీ పథకం, వృద్ధాప్య పింఛన్లు ఆదర్శణీయమైన పథకాలని సోనియా కితాబిచ్చారు. మందుల పంపిణీపై బీజేపీ చేస్తున్న ఆరోపణలపై సోనియాగాంధీ మండిపడ్డారు. వారు అధికారంలో ఉండగా ఇలాంటి పథకాలు ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో మరోమారు కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *