ముసాయిదా సిద్ధం చేసిన జీవోఎం
ఆమోదం తెలుపనున్న షిండే
ఏ క్షణాన్నైనా కేబినెట్ ముందుకు?
ఈ సమావేశాల్లోనే బిల్లు : దిగ్విజయ్
న్యూఢిల్లీ, నవంబర్ 27 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ ముసాయిదాకు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే ఆమోదం తెలపడమే మిగిలిఉంది. గురు, శుక్రవారాల్లో కేంద్ర కేబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) జరిపిన సమావేశం బుధవారం సాయంత్రం 7గంటలకు ముగిసింది. కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్ షిండే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మంత్రుల బృంద సుదీర్ఘంగా జరిగిన సమావేశం ముగిసింది. మూడున్నర గంటలపాటు ఈ సమావేశం సాగింది. కీలక శాఖల ఉన్నతాధికారులతో విడివిడిగా జీఓఎం చర్చలు జరిపింది. సమావేశంలో జలవనరులు, ఆర్థిక, విద్యుత్, ¬ంశాఖ అధికారులు పాల్గొన్నారు. నార్త్‌బ్లాక్‌లో రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన జీవోఎం సమావేశం సుదీర్ఘంగా సాగింది. పోలీసు సిబ్బంది, తీరప్రాంత భద్రత వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు. జవోఎంతో సమావేశమైన జలవనరులు, ఆర్ధిక, పాలన సిబ్బంది, విద్యుత్ శాఖల అధికారుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో కీలక శాఖల ఉన్నతాధికారులతో వేర్వేరుగా చర్చలు జరిపారు. టాస్క్‌ఫోర్స్ విజయ్‌కుమార్‌తో పాటు రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, ఆర్థిక, విద్యుత్, హోంశాఖ అధికారులతో చర్చించారు. సమావేశం అనంతరం షిండే విలేకరులతో మాట్లాడుతూ, అన్ని విషయాలు చర్చించామని అన్నారు. రాష్ట్ర విభజన అంశంపై మరికొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. ఇదిలావుంటే నెలాఖరుకు అసెంబ్లీకి బిల్లు వస్తుందని, రాష్ట్ర విభజనపై అన్ని అంశాలను జీవోఎం పరిశీలిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవోఎం నివేదిక కేబినెట్ ముందుకు వస్తుందన్నారు. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ విధేయుడేనని, అధిష్ఠానం నిర్ణయాన్ని సీఎం గౌరవిస్తారని అన్నారు. ఉమ్మడి రాజధాని ఏర్పాటు చేసే వెసులుబాటు రాజ్యాంగంలో ఉందని వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బిల్లు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగ పరిధికి లోబడి హైదరాబాద్నుఉమ్మడి రాజధాని చేస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆ అవకాశం రాజ్యాంగంలో ఉందని తెలిపారు. ఉమ్మడి రాజధానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి జరుగుతోందని అన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఆంటోని కమటీ సీఫార్సులు జిఓఎంకు అందించినట్లు తెలిపారు. జిఓఎం నివేదిక సిద్ధం చేస్తుందని చెప్పారు. అన్ని అంశాలను జిఓఎం పరిశీలిస్తుందన్నారు. జిఓఎం నివేదిక కేంద్ర మంత్రి మండలి మందుకు వస్తుందని చెప్పారు. తెలంగాణ బిల్లు త్వరలో అసెంబ్లీకి ముందుకు వస్తుందన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని దిగ్విజయ్ చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేయడంలో తప్పులేదన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గౌరవిస్తారని చెప్పారు. అయితే ఎవరైనా సిడబ్ల్యూసి నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. ఎవరికి వారు తమ ఆందోళనలను తెలియజేశారని రాష్ట్ర విభజనపై అన్ని అంశాలను జీవోఎం పరిశీలిస్తుందని దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ఇప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదన్నారు. సిఎం కిరణ్ కూడా అంతేనన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తారని, రాజ్యాంగ పరిధికి లోబడే హైదరాబాదును ఉమ్మడి రాజధానిని చేస్తామని అన్నారు. తెలంగాణపై సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉందన్నారు. త్వరలో కేబినెట్ ముందుకు జివోఎం నివేదిక వస్తుందని ,త్వరలో అసెంబ్లీకి తెలంగాణ బిల్లును పంపిస్తామని చెప్పారు. ఉమ్మడి రాజధాని ఏర్పాటు చేసే వెసులుబాటు రాజ్యాంగంలో ఉందని , ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. అధిష్టానాన్ని ధిక్కరించేలా మాట్లాడిన వారిపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు కదా! అని విలేకరులు ప్రశ్నించగా.. తాను మాట్లాడతానని చెప్పారు. ఈ దశలో త్వరలోనే రాష్ట్ర శాసనసభకు తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోని నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ ముగిసిన అనంతరం దిగ్విజయ్ విూడయాతో మాట్లాడారు. విూడియాతో దిగ్విజయ్ మాటలు…’ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేసేందుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి రాజధానిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందనుకుంటున్నా. అన్ని అంశాలను జీవోఎం పరిశీలిస్తుంది. ఇవాళ్టితో జీవోఎం తన నివేదికను పూర్తి చేస్తుంది. జీవోఎం నివేదిక త్వరలోనే కేబినెట్ ముందుకు వస్తుంది. అని వివరించారు.