Tuesday, 3 November 2026

శంకర్‌రామన్‌ హత్య కేసులో జయేంద్ర సరస్వతికి ఊరట

కేసు దర్యాప్తు సరిగా సాగలేదు
ప్రాసిక్యూషన్‌ ఆధారాలు సంపాదించలేదు : కోర్టు
చెన్నై, నవంబర్‌ 27 (జనంసాక్షి) :
శంకర్‌రామన్‌ హత్య కేసులో కంచి స్వాములకు ఎట్టకేలకు ఊరట దక్కింది. కాంచీపురంలోని వరదారాజ పెరుమాళ్‌ ఆలయం మేనేజర్‌ శంకర్రామన్‌ హత్య కేసులో కంచి కామకోటి పీఠాధిపతులకు ఊరట లభించింది. జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి నిర్దోషులని పుదుచ్చేరి జిల్లా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో స్వాముల ప్రమేయంపై దర్యాప్తు బృందం ఆధారాలు చూపలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. కేసు దర్యాప్తు కూడా సరిగా సాగలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. వీరితో పాటు మిగిలిన నిందితులపైనా అభియోగాలు నిరూపించడంలో దర్యాప్తు బృందం విఫలమవడంతో అందరినీ నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. దీంతో కేసును కొట్టి వేశారు. 2004లో సెప్టెంబర్‌3న కాంచీపురంలోని వరదాజ పెరుమాళ్‌ ఆలయం మేనేజర్‌ శంకర్రామన్‌ ఆలయ ప్రాంగణంలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. దాంతో ఆ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ హత్యలో కంచి పీఠాధిపతులు పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కంచి పీఠాధిపతులు జయేంద్ర, విజయేంద్ర సరస్వతులతో పాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద నిందితులుగా కేసులు నమోదుయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పుదుచ్చేరి కోర్టు 9 సంవత్సరాల పాటు 189 మంది సాక్షులను విచారించింది. జయలలిత అప్పట్లో ఈ కేసుకు సంబంధించి జయేంద్ర సరస్వతిని పాలమూరు పర్యటనలో ఉండగా అరెస్ట్‌ చేయించింది. అయితే తమిళనాడు నుంచి కేసును బదిలీ చేయాలన్న డిమాండ్‌ కారణంగా పుదుచ్చేరికి మార్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *