Tuesday, 3 November 2026

రాజనర్సింహకు ఢిల్లీ పిలుపు

న్యూఢిల్లీ, నవంబర్‌ 27 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై మంత్రుల బృందం సిద్ధం చేసిన ముసాయిదాను గురువారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెడుతున్న సమయంలో ఆయనకు హస్తిన నుంచి పిలుపురావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈమేరకు దామోదర గురువారం ఉదయం ఢిల్లీకి బయల్దేరనున్నారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయం, హైదరాబాద్‌పై పెట్టబోయే స్వల్ప ఆంక్షలపై అధిష్టానం పెద్దలు డెప్యూటీ సీఎంతో చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. మొదట రాజనర్సింహ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండేతో భేటీ అవుతారు. జీవోఎం సిద్ధం చేసిన ముసాయిదాపై షిండే దామోదర అభిప్రాయాలు సేకరించే అవకాశముంది. బిల్లుకు తుది రూపు ఇచ్చే సమయంలో అధిష్టానం ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా తీసుకునే జాగ్రత్త చర్యల్లో భాగంగానే దామోదరను ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *